‘దాదాగిరి’ని సహించేది లేదు:షిండే

2
- Advertisement -

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు ఘటన కలకలం రేపింది. ముంబైలోని జుహు ప్రాంతంలో పార్క్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్ ఫిర్దోజ్ తీవ్రంగా గాయపడ్డారు.

డ్రైవర్ గాయపడటంతో టైగర్ ష్రాఫ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా కారు నడుపుతూ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సకాలంలో స్పందించి డ్రైవర్‌కు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:జనవరి 12 విడుదల..అప్‌డేట్

కాల్పుల ఘటన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేరుగా టైగర్ ష్రాఫ్‌ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్షేమసమాచారాన్ని అడిగి తెలుసుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.

ఈ ఘటనపై స్పందించిన ఏక్‌నాథ్ షిండే.. ముంబైలో ఏ గ్యాంగ్ ఆధిపత్య ప్రదర్శనను, దాదాగిరిని సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

- Advertisement -