BB10:వంశీ కన్నీళ్లు..రోహిత్, షాలిని గొడవ!

9
- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆటలు, గొడవలు, ఎమోషన్స్‌తో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. గోల్డ్, గ్రీన్ టీమ్‌ల మధ్య జరిగిన పోటీలో వంశీ చేసిన చిన్న పొరపాటు గేమ్‌ను చేజార్చింది. మరోవైపు రోహిత్, షాలిని మధ్య గొడవ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

పాయింట్లు సమానంగా ఉండటంతో రెండు టీమ్‌ల నుంచి వంశీ, శివ్ పోటీలోకి దిగారు. గార్డెన్ ఏరియాలో దాచిన ప్లేట్, బౌల్‌ను వెతికి పెడస్టల్‌పై పెట్టాల్సి ఉండగా, ముందుగా వాటిని తీసుకొచ్చిన వంశీ గంట మాత్రమే మోగించి అక్కడే ఆగిపోయాడు. గేమ్ ఇంకా పూర్తికాలేదని త్రిగుణ్ చెప్పడంతో శివ్ ప్లేట్, బౌల్‌ను పెట్టి విజయం సాధించాడు. దీంతో వంశీ తీవ్రంగా బాధపడుతూ ఏడ్చాడు. త్రిగుణ్ అతడికి ధైర్యం చెప్పాడు. గెలిచిన గోల్డ్ టీమ్ గ్రీన్ టీమ్ నుంచి రెండు కుర్చీలను తీసుకుంది.

మరో గేమ్‌లో అమన్, ముకేశ్ అద్భుతంగా ఆడి గెలిచారు. దీంతో గ్రీన్ టీమ్ మరోసారి గోల్డ్ టీమ్ నుంచి రెండు కుర్చీలను సొంతం చేసుకుంది. అనంతరం రోహిత్, షాలిని మధ్య వ్యక్తిగత విషయాలపై వివాదం చెలరేగింది. రోహిత్ తనతో మాట్లాడటానికి నిరాకరించడంతో షాలిని బాధపడింది. కొంతసేపటి తర్వాత ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు.

ఇదిలా ఉండగా, తెల్లవారుజామున కెప్టెన్ గదిలోని డ్రింక్ బాటిల్‌ను రోహిత్ తీసుకెళ్లి షాలిని, అమన్‌తో కలిసి తాగినట్లు ఎపిసోడ్‌లో చూపించారు. ఉదయం కెప్టెన్ సుధీర్ బాటిళ్లు కనిపించకపోవడంతో ఎవరు తీసుకెళ్లారనే అనుమానం వ్యక్తం చేశాడు.

మరోవైపు నరేశ్ అమ్మాయిలా తయారై పార్టీకి వెళ్లిన సందర్భంపై చేసిన స్కిట్ నవ్వులు పూయించింది. రాంప్రసాద్, ముకేశ్ తమ కామెడీతో అలరించారు.

Also Read:రేవంత్ , భట్టి..రాజీనామా చేయరా?

చివర్లో రోహిత్‌ను కొన్నిరోజుల పాటు నామినేట్ చేయకూడదని కొందరు సభ్యులు చర్చించుకున్నారు. త్రిగుణ్‌ను మానిప్యులేటర్‌గా భావిస్తున్నప్పటికీ, అసలు ఆటను రోహితే తనకు అనుకూలంగా నడిపిస్తున్నాడని వారు అనుమానించారు.

- Advertisement -