ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను సవాల్ చేస్తూ ఇండియా కూటమి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.
ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఇండియా కూటమి లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు నోటీసుల ద్వారా కోరింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో పారదర్శకత, ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలపై ఈ పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read:‘జైలర్ 2’..జాతర
ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల పేర్లను తొలగించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై ఎన్నికల సంఘం సమర్పించే వివరణ కీలకంగా మారనుంది.

