డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు క్షేత్రస్ధాయిలో డ్రగ్స్ మూలలను ఖతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. చాపకింద నీరులా తవ్వినకొద్ది టాలీవుడ్ ప్రముఖుల పేర్లు డ్రగ్స్ రాకెట్లో వినపడుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరిని విచారించి సమాచారం సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తాజాగా హీరోయిన్ కాజల్ మేనేజర్ రోనిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రోని ఇంట్లో గంజాయిని స్వాధీనం చేసుకున్న…చాలా కాలం నుంచి డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో రోని హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి,రాశీ ఖన్నాకు మేనేజర్‌గా పనిచేశాడు. కాజల్ మేనేజర్ ఇంట్లో డ్రగ్స్ దొరకడంతో అంతా ఖంగుతిన్నారు.
మరోవైపు డ్రగ్స్ లింకులు వెండి తెర నుంచి బుల్లితెరకూ పాకాయి. ఆడియో ఫంక్షన్లతోపాటు, బర్త్‌డేలు, ఇతర పార్టీల సమయంలో పలువురు నటులు పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో బుల్లితెర నటులకు నోటీసులు జారీచేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారు.