రాహుల్‌తో భేటీకి సీజేఐ నో!

3
- Advertisement -

ఓటు చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై చర్చించేందుకు ఇండియా కూటమి నేతలు కోరిన సమావేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. ఈ అంశాలు ఇప్పటికే న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున సమావేశం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే ప్రతి భారత పౌరుడికి సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయని, సాధారణ పౌరుల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధుల వరకు ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. చట్టం ప్రకారం తమకు అందాల్సిన న్యాయం కోసం ప్రతి భారతీయుడికి కోర్టును సంప్రదించే హక్కు ఉందని వివరించారు.

Also Read:‘బ్లడీ రోమియో’ కోసం స్టైలిష్ మేకోవర్

సమావేశం కోసం తనకు ఆదివారం లేఖ అందిందని, ఎందుకు భేటీ కాలేకపోతున్నానో వివరిస్తూ అదే రాత్రి సమాధానం పంపానని సీజేఐ వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సోమవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఆయనతో సమావేశం కావాలని కోరారు. అయితే, సంబంధిత అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో న్యాయపరమైన విచారణలో ఉన్నందున ఆయన ఈ అభ్యర్థనను తిరస్కరించారు.

- Advertisement -