‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఫ్లేవర్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్, విప్లవ బ్యాక్ డ్రాప్ తో ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలకు వచ్చిన ఆసక్తిని కొనసాగిస్తూ మేకర్స్ తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
కళ్యాణ్ ఓ లోకల్ థియేటర్‌ను నడుపుతుంటాడు. అతని అమ్మ మాత్రం నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని. సరదాగా సాగిపోయే కళ్యాణ్ జీవితంలోకి ఒడిశాకు చెందిన ఓ అమ్మాయి వస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే భాషా సమస్య వీరి ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఇంతలో కళ్యాణ్ కోసం పోలీసులు వేట మొదలుపెడతారు. అతను మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అని తెలిసి కథ ఒక్కసారిగా సీరియస్ మలుపు తిరుగుతుంది. జైలులో ఉన్న తమ నక్సలైట్ సహచరులను విడిపించేందుకు కళ్యాణ్, అతని గ్యాంగ్ ఓ కీలక రాజకీయ నాయకుడిని కిడ్నాప్ చేయడం ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటివరకు కనిపించిన సరదా ప్రపంచం వెనుక ఉన్న అసలు సంఘర్షణను ఈ ట్విస్ట్ బయటపెడుతుంది. 1992లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో కథ ఆసక్తికరంగా సాగుతుంది.
ట్రైలర్‌లో శ్రీ విష్ణు అదరగొట్టారు. మొదటి సన్నివేశం నుంచే తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఆయన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా పదాలను నముకుతూ మాట్లాడే శైలి నవ్వులు పూయిస్తుంది. నక్సలైట్‌గా సీరియస్ సన్నివేశాల్లో కనిపించినా, సినిమాలోని సహజమైన కామెడీ ఫ్లేవర్‌ను ఆయన తన పెర్ఫార్మెన్స్‌తో అలరించారు.
ఒడిశా అమ్మాయి పాత్రలో మహిమా నంబియార్ ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చారు. శ్రీ విష్ణుతో ఆమె కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. అతని తల్లిగా రాధికా శరత్‌కుమార్ మరో కామెడీ లేయర్‌ను జోడించారు. నందమూరి బాలకృష్ణకు వీరాభిమానిగా ఆమె పాత్ర ఆసక్తిని పెంచుతుంది. సత్య, సుదర్శన్ తదితరులు కూడా మంచి కామెడీ అందించబోతున్నట్లు ట్రైలర్ చెబుతోంది. కేరళకు చెందిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో ఇంటెన్సిటీని తీసుకొచ్చారు. ఉపేంద్ర లిమాయే కూడా కీలక పాత్రలో కనిపించారు.
‘కామ్రేడ్ కళ్యాణ్’కు విజువల్స్ మరో బలంగా నిలిచాయి. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని గ్రామీణ ప్రాంతాలను అందంగా చూపించింది. పచ్చని ప్రకృతి, సహజమైన లొకేషన్స్ 1992 నాటి కాలాన్ని రీక్రియేట్ చేశాయి. విజయ్ బల్గానిన్ నేపథ్య సంగీతం కామెడీ సన్నివేశాలకు చక్కగా సరిపోవడంతో పాటు నక్సలైట్ ఎపిసోడ్స్‌లో టెన్షన్‌ను పెంచింది. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ ట్రైలర్‌ను ఆసక్తికరంగా, మంచి పేస్‌తో నడిపించింది. ప్రొడక్షన్ డిజైన్, ఇతర సాంకేతిక అంశాలు కూడా ఆకట్టుకున్నాయి.
Also Read:ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు నోబెల్
‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ సినిమాలోని క్విర్కీ కామెడీని చూపిస్తూనే, దాని వెనుక ఉన్న సీరియస్ సంఘర్షణపై ఆసక్తిని పెంచింది. వినోదం, ప్రేమ, పీరియడ్ ఎలిమెంట్స్‌తో పాటు విప్లవ నేపథ్యాన్ని మేళవించిన ఈ సినిమా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తారాగణం: శ్రీ విష్ణు, మహిమా నంబియార్, రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల
సమర్పణ: కోన వెంకట్
నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి & సీతా కర్నాటి
బ్యానర్: స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP
సంగీతం: విజయ్ బుల్గానిన్
DOP: సాయి శ్రీరామ్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
PRO: వంశీ-శేఖర్

