BB10:టార్గెట్.. అమన్, అపూర్వ!

1
- Advertisement -

బిగ్ బాస్ ఇంట్లో ఆదివారం ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ముగియడంతో.. ఇప్పుడు సోమవారం నామినేషన్స్‌కు రంగం సిద్ధమైంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ చాలా వాడీవేడిగా సాగినట్టు కనిపిస్తోంది. నామినేషన్స్ కోసం కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓ ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు.

ఇంట్లో ఓ గుమ్మడికాయను దాచిపెట్టి.. ఇద్దరు కంటెస్టెంట్లను చొప్పున పిలుస్తారు. ఆ గుమ్మడికాయ ఎవరి చేతికి చిక్కితే.. వారికి నచ్చిన కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే అవకాశం లభిస్తుంది. నామినేషన్ చేసిన తర్వాత.. తాము ఎవరిని నామినేట్ చేశారో వారి ముందు ఉంచిన దిష్టిబొమ్మ కుండను పగలగొట్టాలి.

ఈ క్రమంలో రామ్ ప్రసాద్.. అమన్‌ను నామినేట్ చేశాడు. గతంలో త్రిగుణ్ గేమ్‌లో గాయపడిన ఘటనను ప్రస్తావిస్తూ అమన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనికి అమన్ కూడా గట్టిగానే రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. త్రిగుణ్‌కు సంబంధించిన విషయం కావడంతో అతడు కూడా ఈ వివాదంలోకి రావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అపూర్వ, రోహిత్, వంశీ, నరేష్ కూడా ఈ వాగ్వాదంలోకి వచ్చినట్లు ప్రోమోలో కనిపించింది.

మరోవైపు ముఖేష్.. అపూర్వను నామినేట్ చేశాడు. గత వారం కెప్టెన్‌గా ఆమె వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆమె ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అపూర్వ, వర్షిణి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. గతంలో నాగార్జున అపూర్వను ‘డిజాస్టర్ కెప్టెన్’గా పేర్కొన్న విషయాన్ని వర్షిణి గుర్తుచేసింది.

Also Read:వైవా హర్ష ..లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

ఇక త్రిగుణ్ కూడా అపూర్వను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమో ద్వారా అర్థమవుతోంది. మొత్తంగా ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ ఫుల్ ఫైర్‌తో సాగనున్నట్లు కనిపిస్తోంది.

- Advertisement -