‘సింగ్ గీతం’..వెలుగుతూనే ఉంటుంది

9
- Advertisement -

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణం పట్ల ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాసరావు   మృతికి సంతాపం తెలియజేస్తూ భావోద్వేగంతో నివాళులు అర్పించారు.

”తెలుగు సినిమాకే వెలుగులు పంచిన విజయా సంస్థ దర్శక వారసుడు సింగీతం శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు. గుండె కలచివేసింది. కళ్ళు చెమర్చాయి. కళాఖండాలను రూపొందించినా, నిరాడంబరుడిగానే చివరివరకూ మసలిన దార్శనిక ముని ఆయన.

ఒకప్పుడు ఆయనతో చేద్దామనుకున్నా కథ కలిసి రాలేదు. కానీ నా కల ఆగిపోలేదు. ‘సింగ్ గీతం’ రూపంలో వైజయంతీ పతాకం మీద శాశ్వతంగా వెలుగుతూనే ఉంటుంది.

Also Read:వైవా హర్ష ..లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

మరణం లేని మహనీయుడు. ఆయనకి నా కన్నీటి వీడ్కోలు అని తెలిపారు అశ్వినీదత్.

- Advertisement -