బహిరంగ మల విసర్జన రహిత దేశంగా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పూనుకొన్నారు.ఈ మేరకు స్వచ్ఛభారత్ మిషన్ ను మోడీ ప్రారంభించారు. దేశంలోని ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించడమే స్వచ్చభారత్ మిషన్ లక్ష్యం. ఈ మేరకు 2019 నాటికి భారత్ ను క్లీన్ ఇండియాగా మార్చేందుకు ప్రణాళికలను సిద్దం చేశాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఔరంగాబాద్ జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎమ్) డీఎమ్ కన్వాల్ తనూజ్ జమ్ హోరే గ్రామానికి వెళ్లారు.అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని గ్రామస్తులకు మరుగుదొడ్లు కట్టించుకోవాలని, వాటి వల్ల జరిగే లాభనష్టాల గురించి వారికి వివరించారు. ఈ సమయంలో ఒక వ్యక్తి లేచి, తమకు కూడా మరుగుదొడ్డి కట్టించుకోవాలని ఉందని, అయితే అందుకు సరిపడా డబ్బు తమ వద్ద లేదని తెలిపాడు.
దీంతో ఆగ్రహానికి గురైన కన్వాల్ ‘డబ్బు లేకపోతే నీ భార్యను అమ్ముకో’ అనేశారు. దీంతో గ్రామస్థులంతా షాక్ తిన్నారు. అనంతరం ఆయన కొనసాగిస్తూ, ‘అందరికీ చెబుతున్నా వినండి. మీ భార్యల గౌరవం కాపాడుకోవాలంటే మరుగుదొడ్డి తప్పక నిర్మించుకోవాలి. మీ భార్యల విలువ 12,000 రూపాయల కంటే తక్కువని అనుకుంటే మాత్రం మరుగుదొడ్డిని నిర్మించుకోవద్దు’ అని సూచించారు. అంతే కాకుండా మరుగుదొడ్ల కోసం ప్రభుత్వం ముందుగా డబ్బులిస్తే వాటిని వేరే అవసరాల కోసం వినియోగించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. దీంతో ఆయనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
#WATCH Aurangabad's DM Kanwal Tanuj says, " go sell your wife" to a person while addressing a public gathering on cleanliness (22.07) #Bihar pic.twitter.com/kqkQpVdC1q
— ANI (@ANI) July 23, 2017