- Advertisement -
అనంతగిరి బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సహాయక చర్యల్లో పాల్గొనాలని స్థానిక బీఆర్ఎస్ నాయకత్వానికి కేటీఆర్ సూచించారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం, పలువురు గాయపడటం అత్యంత బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొని, క్షతగాత్రులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పాటు వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని స్థానిక బీఆర్ఎస్ నాయకత్వానికి కేటీఆర్ సూచించారు.బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు స్థానిక నాయకులు అధికారులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు.
Also Read:యువీ రికార్డును సమం చేసిన అభిషేక్
- Advertisement -

