కత్రినాకు మద్దతుగా శోభితా!

2
- Advertisement -

నవంబర్ 2025లో తన కుమారుడు ‘విహాన్’ జన్మించిన తర్వాత నటి కత్రినా కైఫ్ తన శారీరక రూపంపై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. తల్లి అయినప్పటి నుండి ఆమె మీడియా వెలుగులకు దూరంగా ఉంటున్నప్పటికీ ఇటీవల ఒక కార్యక్రమంలో ఆమె కనిపించిన తర్వాత పోస్ట్‌పార్టమ్ (ప్రసవానంతర) శరీర ఆకృతిపై కొందరు కామెంట్లు చేశారు. దీనిపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేయగా తాజాగా నటి శోభితా ధూళిపాళ్ల కూడా కత్రినాకు మద్దతుగా నిలిచారు.

కత్రినా కైఫ్‌పై జరుగుతున్న ట్రోలింగ్ కామెంట్ల అంశంపై శోభితను ప్రశ్నించగా.. చిత్ర పరిశ్రమలోని మహిళలు ఎదుర్కొనే నిరంతర పరిశీలనపై ఆమె మాట్లాడారు. మహిళల నుండి సమాజం తరచుగా ఎన్నో విరుద్ధమైన ప్రమాణాలను ఆశిస్తుందని, అయితే ప్రతీ ఒక్కరూ ఇలాంటి విమర్శలపై భిన్నంగా స్పందిస్తారని ఆమె పేర్కొన్నారు.

శోభిత మాట్లాడుతూ..మహిళలు బలంగా ఉండాలని, సున్నితంగా ఉండాలని.. ఇలా చాలా రకాలుగా ఉండాలని ఆశిస్తారు. ప్రతీ మహిళ సమస్యలను వేర్వేరు రీతిలో ఎదుర్కొంటుంది, దానికి ప్రత్యేకమైన నియమాలేవీ ఉండవు. బహిరంగ విమర్శలు నిరాశపరుస్తాయని మీరు చెప్పినప్పుడు, అది చాలామందికి నిజమే కావచ్చు; ఎందుకంటే మనమందరం మనుషులమే. మనకు సరిపోయే రీతిలోనే మనం ఆ పరిస్థితులను ఎదుర్కొంటాం అని వ్యాఖ్యానించారు.

Also Read:సిరిసిల్ల క్రికెటర్‌ అక్షరకు కేటీఆర్ అండ

- Advertisement -