మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు ప్రవర్తనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులు వయస్సు, రాజకీయ స్థాయి మరచిపోయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేర్ని నాని మరియు ఆయన కుమారుడు కిట్టు రోడ్లపై అంబోతుల్లా ప్రవర్తిస్తూ నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మంత్రి తీవ్రంగా దుయ్యబట్టారు.మచిలీపట్నం (బందరు) ప్రాంత అభివృద్ధికి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని గోవా షిప్‌యార్డ్ ప్రాజెక్టును తీసుకువచ్చారని గుర్తుచేశారు. అభివృద్ధికి కృషి చేసిన లోకేష్‌ను విమర్శిస్తే.. ఐదేళ్ల పాలనలో బందరుకు ఏమీ చేయని జగన్ మోహన్ రెడ్డిని ఏమనాలి? అని ప్రశ్నించారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో కేవలం కక్షసాధింపు చర్యలు, అక్రమ కేసులు మరియు వేధింపులతో ప్రజలను, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసారని మండిపడ్డారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు.
Also Read:చైనాకు అమెరికా ఆయుధాలు!

