BB10: ‘టోటల్ డామినేషన్’..రచ్చ రచ్చ

1
- Advertisement -

బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం ‘టోటల్ డామినేషన్’ థీమ్‌తో అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల మధ్య జరిగిన తీవ్రస్థాయి వాగ్వాదాలు, ఆరిపోని ఆక్రోశాలు టీవీల స్పీకర్లు బ్లాస్ట్ అయ్యేలా చేశాయి. ఏ ఒక్కరూ తగ్గదేలే అన్నట్లుగా ఘర్షణలకు దిగడంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

గేమ్‌లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లను రెండు జట్లుగా విభజించారు. ఒక జట్టు ‘టీమ్ భైరవ’గా, మరొక జట్టు ‘టీమ్ సప్తశక్తి’గా పేర్లు పెట్టుకున్నాయి. షాలినీ, శ్రిష్టి, చరణ్, నరేష్, త్రిగుణ్, ముఖేష్, దేబ్జానీలతో కూడిన ‘సప్తశక్తి’ టీమ్‌కు, మిగిలిన సభ్యులతో కూడిన ‘భైరవ’ టీమ్‌కు మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. బిగ్ బాస్ ఇచ్చిన ‘డ్యాగర్స్’ (కత్తులు) సంపాదించే టాస్క్‌లో సభ్యులు భౌతిక దాడులకు దిగారు. నరేష్ వద్ద ఉన్న కత్తిని రోహిత్, సుధీర్, రామ్ ప్రసాద్‌లు బలవంతంగా లాక్కోవడంతో నరేష్ తీవ్రంగా కలత చెందాడు. దానికి ప్రతికారంగా సప్తశక్తి టీమ్ సభ్యులు ఝాన్సీపై మూకుమ్మడి దాడికి దిగడం పెద్ద గొడవకు దారితీసింది.

మరోవైపు కెప్టెన్ అపూర్వకు, ఇతర సభ్యులకు మధ్య గొడవలు కొనసాగాయి. డిష్ వాష్ చేయడం, కెప్టెన్ రూమ్ ఖాళీ చేసే విషయాల్లో ముఖేష్, అపూర్వ ల నడుమ గట్టి వాగ్వాదం జరిగింది. కెప్టెన్‌కు గౌరవం ఇవ్వడం లేదని అపూర్వ ప్రశ్నించగా, రూల్స్ పెడితేనే ఫాలో అవుతానని ముఖేష్ తేల్చిచెప్పాడు. త్రిగుణ్ అయితే అపూర్వను కెప్టెన్‌గా పిలవనని తెగేసి చెప్పాడు. ఇక అర్ధరాత్రి వేళ కెప్టెన్ రూమ్ నుంచి త్రిగుణ్ డ్రింక్స్ దొంగిలించడం మరింత ఆజ్యం పోసింది.

ఆ తర్వాత బిగ్ బాస్ ‘రథ నిర్మాణం’ అనే ప్రధాన టాస్క్ ఇచ్చారు. ఈ ఆటకు రోహిత్, షాలినీలు సంచాలకులుగా వ్యవహరిస్తూనే ఆట ఆడాల్సి వచ్చింది. ఈ క్రమంలో అపూర్వ జోక్యం చేసుకోవడంతో షాలినీ ఆమెపై తీవ్రంగా విరుచుకుపడింది. ఆట కొనసాగుతుండగా శ్రిష్టి కాలికి తీవ్ర గాయమైంది. ఆమె మెడికల్ రూమ్‌కు వెళ్లే సమయంలో తన కత్తిని షాలినీకి ఇవ్వగా, అపూర్వ టీమ్ ఆ కత్తిని లాక్కోవడానికి షాలినీపై పడింది. దీంతో త్రిగుణ్, రోహిత్‌ల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత ఆట తిరిగి ప్రారంభమయ్యాక ముఖేష్ కాలికి కూడా గాయమైంది. అమన్ ఫౌల్ గేమ్ ఆడటం వల్లే ముఖేష్‌కి గాయమైందని షాలినీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:చైనాకు అమెరికా ఆయుధాలు!

అన్ని ఆటంకాలు, వివాదాల మధ్య సాగిన ఈ మొదటి ఘట్టంలో ‘టీమ్ భైరవ’ (రెడ్ టీమ్) విజయం సాధించింది. రథానికి సంబంధించిన మొదటి భాగాన్ని వారు విజయవంతంగా అమర్చారు. ఫిజికల్ టాస్కులు, ఘోరమైన తిట్లు, గాయాలతో నాలుగో వారం మొదటి రోజే హౌస్ అగ్నిగుండంలా మారింది. రాబోయే ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ మరింత తీవ్రంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది.

- Advertisement -