బిగ్ బాస్ తెలుగు ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ‘టెంప్టేషన్ అండ్ టెన్షన్స్’ వారంలో భాగంగా నాగార్జున కంటెస్టెంట్లకు ఊహించని షాక్ ఇచ్చారు. షో చరిత్రలోనే తొలిసారిగా మూడో వారంలోనే ఏకంగా ₹15 లక్షల బ్రీఫ్‌కేస్ ఆఫర్ ఇచ్చి, ఇంటి సభ్యుల నడుమ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించారు. ఈ భారీ మొత్తాన్ని దక్కించుకుని వైల్డ్ కార్డ్ ఎంట్రీ మిథిలేష్ ఇంటి నుంచి బయటకు వచ్చేయడం శనివారం నాటి ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఎపిసోడ్ ప్రారంభంలో నాగార్జున ఇంటి సభ్యుల వైఫల్యాలను, తప్పులను సూటిగా ప్రశ్నించారు.శ్రిష్టి & సుధీర్: శ్రిష్టిని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి, సుధీర్‌పై చెత్త వేయడాన్ని నాగ్ తీవ్రంగా తప్పుపట్టారు. సుధీర్ కూడా “బయట ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు” అని అనడంపై సీరియస్ క్లాస్ పీకారు.
దేబ్జానీ & నరేష్: నరేష్‌ను “చిల్లర మాటలు” అని బాధపెట్టిన దేబ్జానీకి నాగ్ హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో నరేష్ వ్యక్తిత్వాన్ని పొగుడుతూ “నువ్వు ఎవరెస్ట్” అని ప్రశంసించారు.
ముఖేష్ & వర్షిణి: అమన్‌ను “బచ్చా గాడు” అని, మిథిలేష్‌ను “జిమ్ ట్రైనర్ మాత్రమే” అని ముఖేష్ కామెంట్ చేయడంపై నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షిణి, అమన్ ల మధ్య జరిగిన ఫిజికల్ టాస్క్ వివాదాన్ని క్లియర్ చేస్తూ, గేమ్‌లో జెండర్ భేదం లేదని తేల్చి చెప్పారు.
అదర్స్: రోహిత్‌ను ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, షాలినీకి “బిచ్చింగ్ స్టార్” అని కౌంటర్లు వేశారు.
ప్రత్యేక గెస్టులు & షాలినీ ఎమోషనల్ మూమెంట్
‘సిగ్మా ప్రమోషన్స్’లో భాగంగా నటులు సందీప్ కిషన్, సంజయ్ వేదికపైకి వచ్చి సందడి చేశారు. ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడి ట్రైలర్ లాంచ్ చేశారు. మరోవైపు, షాలినీ సేఫ్ అయినట్లు ప్రకటిస్తూ ఆమె తల్లిదండ్రుల ఫోటోను అందించడంతో ఆమె తీవ్ర ఎమోషనల్ అయ్యారు.
₹15 లక్షల జాక్‌పాట్: మిథిలేష్ మాస్టర్ ప్లాన్!
ఎపిసోడ్ ముగింపులో నాగార్జున ఒక బ్రీఫ్‌కేస్‌ను ఇంట్లోకి పంపించారు. మొదట ₹5 లక్షలతో ప్రారంభమైన ఈ టెంప్టేషన్ ఆఫర్‌కు ఎవరూ ముందుకు రాలేదు. నాగ్ దానిని ₹10 లక్షలకు, ఆ తర్వాత ₹15 లక్షలకు పెంచారు. వైల్డ్ కార్డ్‌గా వచ్చిన మిథిలేష్, వచ్చిన రెండు రోజులకే ఈ భారీ మొత్తాన్ని స్వీకరించేందుకు సిద్ధపడ్డాడు.
ఈ డబ్బులు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయని నాగ్ తెలపడంతో, సహచర కంటెస్టెంట్లు మిథిలేష్‌ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, తన నిర్ణయానికే కట్టుబడిన మిథిలేష్, అందరినీ ఒప్పించి ₹15 లక్షల చెక్‌తో ఇంటి నుంచి వైదొలిగాడు. ఆదివారం నాటి ఎపిసోడ్లో మిథిలేష్ స్టేజ్ మీదకు రానుండటంతో ఈ వీకెండ్ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా మారింది.

