ఓడితేనేం.. కప్పు చేజారితేనేం.. చిరస్మరణీయ ప్రదర్శనతో, పోరాటపటిమతో మిథాలీసేన కోట్లాది భారతీయుల మనసులు గెలిచింది. మహిళల క్రికెట్‌నూ అభిమానులు విశేషంగా ఆదరించేలా చేయడం ఈ జట్టు సాధించిన విజయం.. మన మహిళా క్రికెటర్లు ఫైనల్లో శాయశక్తులా పోరాడారు. టోర్నీ మొత్తం పట్టుదలను, నైపుణ్యాలను చూపించారు.. ఇలాంటి జట్టును చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
మహిళల ప్రపంచకప్ లో భారత జట్టు ఆధ్యంతం కొనసాగించిన పోరాట స్పూర్తికి సీఎం కేసీఆర్ కితాబునిచ్చారు. భారత అమ్మాయిలు ప్రపంచకప్ ఫైనల్ లో పోరాడి ఓడినప్పటికీ.. వరల్డ్ కప్ లో రన్నర్స్ గా నిలవడం గర్వకారణమని సీఎం అన్నారు. హైదరాబాద్ కు చెందిన కేప్టెన్ మిథాలి రాజ్ తో పాటు జట్టు సభ్యులందరిని సీఎం అభినందించారు. మహిళల వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు ప్రదర్శించిన ప్రతిభ.. అమ్మాయిలు క్రీడల్లో రాణించాలనే స్పూర్తిని కొనసాగించేందుకు దారి చూపుతుందని సీఎం అభిప్రాయ పడ్డారు. మహిళలను క్రీడారంగంలో మరింత ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
భారత అమ్మాయిలను చూసి గర్విస్తున్నా.. ఈ రోజు కలిసిరాలేదు.. అయితే భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఆదరణ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదని సెహ్వాగ్ అన్నాడు.. మీరు మాకు నమ్మకాన్ని కలిగించారు.. కలలు కనేలా చేశారు.. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం.. మీ ఆటను చూడటాన్ని గౌరవంగా భావిస్తున్నానని గౌతమ్ గంభీర్ అన్నాడు..