దేశ, విదేశాల్లో పర్యటించి బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న గొప్ప నాయకుడు మంత్రి కేటీఆర్. మంత్రిగా పద్మవ్యూహాల్లాంటి సమస్యలను దాటుకుంటూ ప్రజల మనసు గెలుచుకున్నారు. పాశుపతాస్త్రం లాంటి వేగంతో పాలనలో దూసుకెళ్తున్నాడు. ‘ఐకాన్ ఆఫ్ ద ఇయర్’గా అవార్డులు అందుకున్నా, ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్.. నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సంధర్బంగా తన పుట్టినరోజు వేడుకలకు ఎలాంటి కేకులు, బొకేలు తీసుకురావద్దని మంత్రి కేటీఆర్ ప్రియమైన శ్రేయోభిలాషులు, మిత్రులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడా ప్లెక్సీలు, హోర్డింగ్ లు పెట్టొద్దని మంత్రి కేటీఆర్ కోరారు. పత్రికల్లో కూడా ఎలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని కేటీఆర్ సూచించారు. పుట్టినరోజు వేడుకలకు బదులు హరిత హారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కేటీఆర్ తన శ్రేయోభిలాషులు, మిత్రులను కోరారు.

పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుడిభుజంగా ఉంటూ ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్న కేటీఆర్.. 24 జులై, 1976 న జన్మించారు. ఉన్నత విద్యావంతుడు. ఉద్యమంలో భాగస్వామ్యం కాకముందు ఆయన అమెరికాలో ఐటి నిష్ణాతునిగా పనిచేశారు. దక్షిణ భారత దేశానికి సి.ఈ.ఒ. గా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమాన్ని మరింత విస్తృతపరచడంలో కీలక పాత్ర పోశించారు. తెలంగాణా రాష్ట్ర సమితి లో యువకులకు ఐకాన్ గా నిలిచారు.ఆ తరువాత 2009లో తొలిసారి కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. తెలంగాణ ఏర్పాడ్డక రెండోసారి ఎమ్మేల్యేగా గెలిచి తెలంగాణా తొలి ప్రభుత్వంలో ఐటి శాఖా మంత్రిగా, పట్టణాభివృధ్ధి మరికయు మున్సిపల్ శాఖ మంత్రిగా భాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొద్దికాలం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృధ్ది మంత్రి గా పనిచేశారు. సిఎన్ఎన్ మరియు రిట్జ్ మ్యాగజైన్ ల ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలో మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఐకాన్ అవార్డుపొందారు.

ఎన్నికలకు ముందే 100 సీట్లలో టిఆర్ఎస్ ను గెలిపించనున్నట్లు ప్రకటించిన కేటీఆర్, తండ్రి కేసీఆర్ లాగే వ్యూహరచన చేసి ప్రత్యర్ధులను చిత్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడిన తరవాత అంతటి అత్యుత్తమ మెజారిటీ తో 99 సీట్లు.. గెలుచుకోవడం.. అదీ విపరీతమైన పోటీ మధ్య గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. 2009లో సున్నా సీట్లతో జీహెచ్ఎంసీలో అట్టర్ ప్లాప్ అయ్యాం అని తెలిసి కూడా .. గ్రేటర్ ఎన్నికల బాధ్యత తన భుజాన వేసుకుని మరు క్షణం నుంచీ యూత్ వైపు ఆయన పూర్తి టార్గెట్ ని పెట్టాడు. ఈ క్రమంలో నడిచిన తీరుకి కేటీఆర్ ఇచ్చిన ఊతం చాలా ముఖ్యమైనది. ” గాడిద కి గడ్డి వేస్తే ఆవు పాలు ఎలా ఇస్తుంది ? ” అన్న చిన్న లాజిక్ తో టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపేలా చేశారు కేటీఆర్. అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే తమ సిటీ కీ తమకీ మేలు చెయ్యగలదు అని దృడంగా నమ్మి టీఆర్‌ఎస్ కి గుత్తాధిపత్యం కట్టబెట్టారు.

ఒక జాతికి, ఒక తెగ కి తెలంగాణా లీడర్ గా పిలిపించుకునే కేటీఆర్… ఆంధ్రోళ్ళని సైతం మెప్పించి ఓటు బ్యాంకు ని భారీగా రాబట్టుకున్నారు.. సాధారణంగా కొత్త నాయకుడు సమస్యల గురించి మాట్లాడతాడు, కానీ అతనికి ఉద్యమ నేపధ్యం కావచ్చు..ఇంకేదైనా కావచ్చు కేటీఆర్ చెప్పే దాంట్లో సమస్య తో పాటు దాన్ని పరిష్కరించగల అవకాశం దాన్ని సాకారం చేసే విధానం ఇలా ప్రతీదాన్నీ విడమర్చి మరీ చెప్పగల నేర్పరితనం జనాలకి బాగా కనక్ట్ అయ్యేలా చేసింది.

కేటీఆర్ బాల్యమంతా హాస్టల్లలో ఉంటూనే విద్యనభ్యసించారు. 10 ఏండ్లలో ఏడు స్కూళ్ళు మారారు. ఆయనకు 10 ఏండ్ల వయస్సున్నప్పుడై ఆయన యూసుఫ్ గూడ లోని ఆమరావతీ పబ్లిక్ స్కూల్ లో చేరారు. ఆయన విద్యాభ్యాసం నలంద పబ్లిక్ స్కూల్, మహదీపట్నం మరియు సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, ఆబిడ్స్ లో చేశారు. ఇంటర్మీడియెట్ గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజిలో, మైక్రో బయాలజీలో డిగ్రీ ని నిజాం కాలేజీలో పూర్తిచేశారు. పిజి డిగ్రీ బయోటెక్నాలజీ పూనే యూనివర్సిటీ నుంచి, 2000 లో ఎం.బి.ఎ. ( ఈ కామర్స్) న్యూయార్క్ లో పూర్తిచేశారు.
కేటీఆర్ 1998-99 లో న్యూయార్క్ లో షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కు సంబంధించిన ఐఎన్టీటీఆర్ఎ అనే సంస్ధలో తన ఇంటర్న్షిప్ పూర్తి చేసి అక్కడే ప్రాజెక్టు మేనేజర్ గా ఉద్యోగంలో చేరారు. తన పట్టుదల, కార్యదీక్ష వల్ల 3 సంవత్సరాల లోపే దక్షిణ ఆసియా ప్రాంతానికి రీజనల్ డైరక్టర్ స్ధాయి చేరారు. ఆ తరువాత తెలంగాణా ఉద్యమంతో పనిచేయడానికి2004 లో ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆ తరువాత తెలంగాణా ఉద్యమం కోసం పనిచేస్తూ పార్టీని మరింత బలపరచడానికి తీవ్ర కృషిచేశారు. కె.చంద్రశేఖర రావు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయాన్స్ -2 నుంచి వైదొలుగుతూ కరీంనగర్ లోకసభ స్ధానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి. కేటీఆర్ కరీంనగర్ లోకసభ ఎన్నికల ఇంచార్జిగా పనిచేసి కేసీఆర్ తిరిగి 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవడంలో కీలక పాత్ర పోశించారు.

