బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 10 తెలుగు విజయవంతంగా 17 రోజులు పూర్తి చేసుకుంది. వంటగదిలో ఉన్నప్పుడు వంశీ, త్రిగుణ్‌కి ఒక రోజు అంతా నోటికి ప్లాస్టర్ వేయాలని, మాట్లాడకుండా చూసుకోవాలని నాగార్జున పనిష్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అదే విషయాన్ని ఝాన్సీ గుర్తు చేస్తుంది. మీరు వంటగదిలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు అని చెప్తుంది. కావాలంటే ప్లాస్టర్ వేసుకో.. అని త్రిగుణ్ అంటాడు. బిగ్ బాస్ ఆ ప్లాస్టర్ ఇవ్వడం లేదు అని ఝాన్సీ అంటుంది. అయితే మేం ఇలానే మాట్లాడుతూ ఉంటాం అని త్రిగుణ్ అంటాడు. చివరకు బిగ్ బాస్ ప్లాస్టర్ పంపిస్తే వాళ్ల నోటికి వేస్తుంది ఝాన్సీ.
‘టెంప్టేషన్ – టెన్షన్’ థీమ్ హౌస్‌మేట్స్ మధ్య రోజురోజుకూ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. నాగార్జున విధించిన పనిష్మెంట్ అమలు విషయంలో కెప్టెన్ ఝాన్సీకి, త్రిగుణ్‌కు మధ్య తీవ్ర స్థాయి వాదన జరిగింది. వంటగదిలో మాట్లాడకూడదన్న నిబంధనను త్రిగుణ్ ప్రశ్నించగా, బిగ్ బాస్ పంపిన ప్లాస్టర్‌ను అతడి నోటికి వేసి ఝాన్సీ ఊపిరి పీల్చుకుంది.
మరోవైపు గతంలో దేబ్జానీకి రావాల్సిన ఇంటి లేఖను ముకేశ్ నాశనం చేయడంతో ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అయితే, ఆమెను నవ్వించడానికి నరేష్, రామ్ ప్రసాద్ తమ కామెడీతో ‘పెళ్లిచూపులు’ స్కిట్ చేసి ఇంట్లో కాసేపు ఆహ్లాదకర వాతావరణాన్ని నింపారు.అయితే ఈ ప్రశాంతత ఎక్కువసేపు నిలవలేదు. కెప్టెన్సీ కంటెండర్ రేసులో భాగంగా బిగ్ బాస్ నిర్వహించిన స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో అమన్, వర్షిణీల మధ్య జరిగిన పోరు వివాదాస్పదంగా మారింది. పూల్‌లోని మూటలను దక్కించుకునే క్రమంలో వీరిద్దరూ పట్టువదలకుండా ఒకరినొకరు లాక్కుంటూ అత్యంత తీవ్రంగా ఫిజికల్‌గా తలపడ్డారు.
వర్షిణి అమన్‌ను గట్టిగా పట్టుకోవడం, అమన్ సైతం వెనక్కి తగ్గకుండా పోరాడటం చూసేవారికి కాస్త హద్దులు దాటినట్లే అనిపించింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో సంచాలకుడిగా ఉన్న ముకేశ్ జోక్యం చేసుకుని వారిని హెచ్చరించాల్సి వచ్చింది. ఆడ, మగ కంటెస్టెంట్ల మధ్య ఇలాంటి తీవ్రమైన ఫిజికల్ టాస్కులు జరగడం, లైన్స్ క్రాస్ అయ్యేలా కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఎలాంటి క్లాస్ పీకుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:ఆ బ్యాంకులు ఆదివారం ఓపెన్!

