బ్లడ్ అమ్ముకున్నారు..చిరు సాలిడ్ రిప్లై!

2
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ (CCT) ద్వారా గత రెండు దశాబ్దాలకు పైగా వేలాది మందికి రక్తదానం, నేత్రదానం సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే తంలో ఆయనపై మరియు బ్లడ్ బ్యాంక్‌పై వచ్చిన “రక్తం అమ్ముకుంటున్నారు” అనే ఆరోపణలపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇస్తూ ఇచ్చిన సాలిడ్ రిప్లై సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్రంగా చర్చనీయాంశమైంది.

ఆరోపణలు చేసేవారికి, విమర్శకులకు తన శైలిలోనే సమాధానమిచ్చిన చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా సినిమా రెమ్యునరేషన్ ముందు ఆ డబ్బు ఎంత? విమర్శలపై స్పందిస్తూ చిరంజీవి మాట్లాడిన మాటలు ఆయన అభిమానులను, సామాన్య ప్రజలను ఎంతగానో ఆలోచింపజేశాయి. నేను సినిమాల్లో సంపాదించే రెమ్యునరేషన్‌తో పోలిస్తే బ్లడ్ అమ్మి సంపాదిస్తారు అని ఆరోపించే ఆ డబ్బు ఎంత? నా ఒక్క సినిమా పారితోషికం ముందు ఆ సంపాదన ఏపాటిది? లక్షలాది మంది ప్రాణాలు కాపాడేందుకు నా అభిమానులు, దాతలు ఆప్యాయంగా ఇచ్చే రక్తాన్ని వ్యాపారం చేసి సంపాదించాల్సిన అవసరం నాకు ఉందా? అందుకే అలాంటి అర్థం లేని విమర్శలను నేను అసలు పట్టించుకోను అన్నారు.

సేవా దృక్పథం.. కోట్ల మంది ప్రాణాల రక్షణ1998లో ప్రారంభమైన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటివరకు లక్షలాది యూనిట్ల రక్తాన్ని సేకరించి అవసరమైన బాధితులకు అందించారు. తమ అభిమానులు సమాజ శ్రేయస్సు కోసం ఇచ్చే రక్తం ద్వారా వేలాది మంది ప్రాణాలు నిలుస్తున్నాయని, ఎవరైనా రాజకీయ లేదా వ్యక్తిగత కారణాలతో చేసే విమర్శలను పట్టించుకుంటే సేవ ఆగిపోతుందని చిరంజీవి స్పష్టం చేశారు. ఎంతమంది విమర్శించినా సమాజం కోసం తాను ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Alos Read:అనుమాన పక్షి..కామెడీ,మిస్టరీ!

- Advertisement -