ఆసియా గేమ్స్‌..భారత్‌కు తొలిస్వర్ణం

1
- Advertisement -

ఆసియా గేమ్స్ 2026లో భారత్ బోణీ కొట్టింది. మహిళల క్రికెట్ ఫైనల్ పోరులో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు 147 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను మట్టికరిపించి దేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్ ఆసియా గేమ్స్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 216 పరుగులు సాధించింది.

ఈ మ్యాచ్ ద్వారా స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో 11,000 పరుగుల మైలురాయిని కూడా దాటింది. భారత్ స్కోరు 216/5. ఫైనల్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. షెఫాలీ వర్మ కేవలం 29 బంతుల్లో 48 పరుగులు చేసి జట్టుకు వేగవంతమైన పునాది వేసింది. షెఫాలీ అవుటయ్యాక బాధ్యత తీసుకున్న స్మృతి, 45 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు తీయించింది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తక్కువ పరుగులకే అవుటైనా స్మృతి ఒత్తిడికి లోనుకాకుండా ఇన్నింగ్స్‌ను నడిపించింది. మిడిల్ ఓవర్లలో శ్రీలంక పుంజుకునేలా కనిపించినా, వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. కేవలం 22 బంతుల్లోనే 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 216 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.

Also Read:అనుమాన పక్షి..కామెడీ,మిస్టరీ!

217 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత స్పిన్నర్లు ఆరంభం నుంచే తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. శ్రీలంక ఇన్నింగ్స్ పూర్తిగా వారి కెప్టెన్ చమరి అతపత్తు (29 పరుగులు)పైనే ఆధారపడింది. కానీ ఏడో ఓవర్లలోనే దీప్తి శర్మ ఆమెను పెవిలియన్‌కు పంపడంతో శ్రీలంక ఓటమి ఖాయమైంది. చమరి తప్ప లంక జట్టులో మరెవరూ 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు. ఆసియా గేమ్స్ 2022లో పసిడి పతకం సాధించిన భారత మహిళల జట్టు ఈసారి కూడా అదే జోరును కొనసాగించి వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుని దేశానికి గర్వకారణంగా నిలిచింది.

- Advertisement -