యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. ఇటీవల భుజానికి అయిన గాయం కారణంగా శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్, త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ అక్టోబర్ మొదటి వారం నుంచి ‘డ్రాగన్’ తదుపరి షెడ్యూల్లో జాయిన్ కానున్నారు. ఎన్టీఆర్ లేని సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఇప్పటివరకు దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది.
అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఈ సుదీర్ఘ షెడ్యూల్ 2027 ఫిబ్రవరి వరకు కొనసాగనుంది. ఈ షెడ్యూల్లోనే ‘డ్రాగన్’ తదుపరి సీక్వెల్‌కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించాలని చిత్రబృందం భావిస్తోంది.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారం, ఆధిపత్య పోరాటం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే క్రూరమైన మాస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజూ మీనన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తున్నారు.
Also Read:Cult:#కల్ట్ అక్టోబర్ 30న
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

