బిగ్ బాస్ తెలుగు సీజన్ లో రెండో వారంలో నటుడు కృష్ణుడు నామినేషన్స్‌లోకి వచ్చినప్పుడే చాలామందికి ఆయన ఎలిమినేషన్ పై సందేహాలు మొదలయ్యాయి. ఊహించినట్లుగానే, సరిగ్గా ఆడలేకపోయిన కృష్ణుడు రెండో వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి వీడ్కోలు తీసుకున్నారు.
ఎలిమినేషన్ ప్రకటన అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ.. తన నిష్క్రమణ పట్ల ఎలాంటి బాధ లేదని, చాలా సంతోషంగానే వెళ్తున్నానని చెప్పారు. “గత వారంలో నేను షుగర్ మందులు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల నీరసించిపోయాను, నా తప్పును నేను ఒప్పుకుంటున్నాను. స్ట్రాంగ్ గేమ్ ఆడాలంటే హౌస్‌లో బలమైన ప్లేయర్స్ మాత్రమే ఉండాలి” అని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో నటుడు రోహిత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. “మీ కళ్లు మా నాన్నగారిలా ఉంటాయి అన్నా.. మీరు వెళ్తుంటే ఆ కళ్లను చూసే అవకాశం పోతోంది” అని ఏడ్చేశాడు. దీనికి స్పందించిన కృష్ణుడు, తొలివారంలో కోపంలో రోహిత్‌పై గరిచినందుకు క్షమాపణలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కృష్ణుడు వెళ్తుండగా త్రిగుణ్ ఆయన కాళ్లకు నమస్కరించి, “నాకు ఒక పిల్లర్‌లా, కొండంత బలంగా నిలిచారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టేజ్ పైకి వచ్చిన కృష్ణుడిని నాగార్జున సాదరంగా ఆహ్వానించారు. “సార్, ఈ సీజన్ 10X అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ.. ఇప్పుడు అర్థమైంది. బిగ్ బాస్ అంటే ఎంత కష్టమో తెలిసొచ్చింది” అని కృష్ణుడు అన్నారు. అనంతరం బిగ్ బాస్ ఆయన షార్ట్ జర్నీ వీడియోను ప్రదర్శించారు.
పాజిటివ్ vs నెగిటివ్ ప్లేయర్స్
హౌస్‌లోని సభ్యులను పాజిటివ్, నెగిటివ్ కేటగిరీలుగా వర్గీకరించమని నాగార్జున కోరగా:
పాజిటివ్: దేబ్జానీ, ఝాన్సీ, సృష్టి, అమన్.
నెగిటివ్: సుధీర్, ముకేష్, వర్షిణి, చరణ్.
నెగిటివ్‌గా పేర్కొన్న వారు తనతో మనస్పూర్తిగా ఉండలేదని, పలకరించినా పూర్తి స్థాయిలో స్పందించలేదని కృష్ణుడు వివరించారు. ఆసక్తికరంగా ఆయన త్రిగుణ్‌ను ఏ కేటగిరీలోనూ పెట్టలేదు.
తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తూ.. “నేను నెలకు దాదాపు 10 కేజీల స్వీట్స్ తింటాను. కానీ హౌస్‌లోకి వచ్చాక గత 8 రోజులుగా ఒక్కసారిగా షుగర్ తినడం మానేశాను. హెల్త్‌కు మంచిదని అనుకుంటే, అది రివర్స్ అయి శరీరం బాగా వీక్ అయిపోయింది. అదే నా ఆటపై తీవ్ర ప్రభావం చూపించింది” అని తెలిపారు.
Also Read:Cult:#కల్ట్ అక్టోబర్ 30న
దీనికి నాగార్జున స్పందిస్తూ.. “బయటకు వెళ్లాక ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా షుగర్ తగ్గించుకో” అని సలహా ఇస్తూ కృష్ణుడిని వీడ్కోలు పలికారు. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో మన ‘వినాయకుడు’ కృష్ణుడి ప్రయాణం ముగిసింది.

