ది ప్యారడైజ్..టికెట్ రేట్ల పెంపు

7
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ చిత్రం విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మేకర్స్‌కు తీపి కబురు అందించింది. ఈ సినిమా కోసం టికెట్ ధరల పెంపుతో పాటు, సెప్టెంబర్ 23న ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు జీవో జారీ చేసింది.

సెప్టెంబర్ 23, సాయంత్రం 6:30 గంటలకు ప్రీమియర్‌లకు అనుమతివ్వగా టికెట్ ధర: రూ. 500 (జీఎస్టీతో కలిపి).

టికెట్ ధరల పెంపు వివరాలు:

1. మొదటి విడత (సినిమా విడుదల రోజైన సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 27 వరకు):మల్టీప్లెక్స్‌లు: ప్రస్తుత టికెట్ రేటుపై అదనంగా రూ. 94 (జీఎస్టీతో కలిపి) పెంచుకునేందుకు అనుమతి.

సింగిల్ స్క్రీన్‌లు: అదనంగా రూ. 48 (జీఎస్టీతో కలిపి) పెంపు.

2. రెండో విడత (సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 3 వరకు): మల్టీప్లెక్స్‌లు: అదనంగా రూ. 45 (జీఎస్టీతో కలిపి) పెంపు. సింగిల్ స్క్రీన్‌లు: అదనంగా రూ. 23 (జీఎస్టీతో కలిపి) పెంచుకునే వెసులుబాటు. దీంతో పాటుగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ 5 షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Also Read:Cult:#కల్ట్ అక్టోబర్ 30న

ప్రభుత్వ నిబంధనలు మరియు ఆదేశాల మేరకు, ఈ చిత్ర నిర్మాణ సంస్థ అయిన ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ LLP’ వర్గాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు రూ. 1 కోటి విరాళంగా అందించాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడం, ప్రభుత్వం నుండి అదనపు షోలు మరియు ధరల పెంపునకు అనుమతులు రావడంతో చిత్రబృందం నైజాం పరిధిలో భారీ ఓపెనింగ్స్‌ను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది.

- Advertisement -