కేంద్ర ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైతే, మరోసారి భారీ ఉద్యమాన్ని చేపడతామని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ తికాయత్ హెచ్చరించారు.
పంటలకు కనీస మద్దతు ధరకు (MSP) చట్టబద్ధమైన హామీ ఇవ్వడంతో పాటు, రాబోయే చెరకు కోత కాలానికి (Crushing season) ఉత్తరప్రదేశ్‌లో చెరకు ధరను క్వింటాల్‌కు రూ. 500 వరకు పెంచాలని జీఐసీ గ్రౌండ్లో జరిగిన రైతు మహాపంచాయత్‌లో తికాయత్ డిమాండ్ చేశారు.దీంతో పాటు, భూముల సర్కిల్ ధరల పెంపు, వ్యవసాయ భూముల పరిరక్షణ వంటి పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Also Read:నానితో కయాదు లోహార్..
కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీకి చట్టబద్ధమైన హామీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నెరవేర్చలేదని, అందువల్ల పోరాటం తప్ప రైతులకు వేరే మార్గం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మహాపంచాయత్ సందర్భంగా తమ 16 కీలక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక జిల్లాల అధికారుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు BKU యూనియన్ సమర్పించింది.

