‘బలగం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎల్లమ్మ. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో, దేవి శ్రీ ప్రసాద్ సరసన కథానాయికగా యువ నటి అనంతిక సనిల్‌కుమార్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పాత్ర కోసం గతంలో సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి ప్రముఖ నటీమణుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే మేకర్స్ ఇప్పటివరకు వారి గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కథలోని ప్రాముఖ్యత, తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌కి సరిపోయే రూపం ఉన్నందున అనంతికను ఎంపిక చేసినట్లు సమాచారం. చిత్ర బృందం నుంచి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read:వెరైటీ డిషెస్..ఆసక్తికర అంశం!
‘బలగం’తో భావోద్వేగపూరితమైన కథనాలను అందించిన వేణు …తొలిసారి కథానాయకుడిగా మారుతున్న దేవి శ్రీ ప్రసాద్, యువ నటి అనంతిక కలయిక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

