ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్లో సరికొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. ‘క’, ‘కె-ర్యాంప్’ వరుస విజయాలతో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. ‘SR కళ్యాణమండపం’తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి తొలిసారి నిర్మాతగా మారి జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే “Ek Dum Bindass Pakaane Waale” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన క్విర్కీ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అలాగే BTS వీడియో సెట్స్‌లో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించింది.
వినాయక చవితి సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో కిరణ్ అబ్బవరం, దేవిక భట్ .. అందంగా అలంకరించిన గణేశుడి విగ్రహం ముందు నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు. వార్మ్ గోల్డెన్ లైటింగ్, పూల అలంకరణలు, సంప్రదాయ వాతావరణం, భారీ గణేశుడి విగ్రహం పోస్టర్‌కు పండుగ కళను తీసుకొచ్చాయి. అదే సమయంలో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు.
ఈ చిత్రంలో శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు.
Also Read:కాంగ్రెస్ పథకాలు..ట్రంప్ కాపీ!
ఈ చిత్రానికి విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
నటీనటులు: కిరణ్ అబ్బవరం, దేవిక భట్, శరత్ కుమార్, సాయి కుమార్ తదితరులు
టెక్నికల్:
రచన, దర్శకత్వం: కిరణ్ అబ్బవరం
నిర్మాత: సుధాకర్ చాగంటి
బ్యానర్: జాయ్ ఫిల్మ్స్
సహ నిర్మాత: సురేష్ ఎర్ర
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
DOP: విశ్వాస్ డేనియల్
ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
ఎడిటర్: సంతోష్ నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: రాజేష్ కమర్సు
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ & ట్రెండ్స్

