NEXUS Mallలో విత్తన గణపతుల పంపిణీ

2
- Advertisement -

మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా హైదరాబాద్‌లోని నెక్సస్ మాల్ (Nexus Mall) లో ఒక విశేషమైన కార్యక్రమం నిర్వహించబడింది.

మేఘన ముసునూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర కో-ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ గారు పాల్గొని, మాల్‌కు వచ్చిన పిల్లలకు 500 విత్తన గణపతులను (Seed Ganeshas) ఉచితంగా అందజేశారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణపై పిల్లలకు చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో ఈ విత్తన గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మట్టితో తయారు చేసిన ఈ విత్తన గణపతులను పూజించిన అనంతరం కుండీలలో నిమజ్జనం చేయడం ద్వారా వాటిలోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయని, ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు.

కార్యక్రమ నిర్వాహకులు మేఘన ముసునూరి గారు మాట్లాడుతూ… వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా (Eco-friendly) జరుపుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాలకు దూరంగా ఉంటూ మట్టి గణపతులను, విత్తన గణపతులను మాత్రమే ఉపయోగించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు విశేష సంఖ్యలో పాల్గొని విత్తన గణపతులను ఉత్సాహంగా స్వీకరించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందానికి మరియు నిర్వాహకులకు మాల్ సందర్శకులు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -