విజయ్..’రణబలి’ నిజమైన కథనా?

0
- Advertisement -

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాబోతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబలి’. ఈ సినిమా కల్పిత గాథగా తెరకెక్కినప్పటికీ, బ్రిటీష్ పాలనలో భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన సంఘటనల్లో ಒಂದైన 1876-1878 నాటి ‘మద్రాస్ కరువు’ (రాయలసీమ కరువు) నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో భారీ కుతూహలాన్ని పెంచడమే కాకుండా, ఈ సినిమా నిజమైన కథ ఆధారంగా తెరకెక్కిందా అనే అనుమానాలను రేకెత్తించింది.
‘రణబలి’ అనేది ఏ ఒక్క నిర్దిష్ట చారిత్రక వ్యక్తి జీవిత ఆధారంగా తీసిన బయోపిక్ కాదు. కానీ, బ్రిటీష్ కాలంలో రాయలసీమ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు మరియు వారి పోరాటాలను ప్రతిబింబించేలా ఈ కథను తీర్చిదిద్దారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ‘రణబలి’ అనే టైటిల్ పాత్రలో బ్రిటీష్ తీవ్ర అణచివేతపై తిరగబడే రాయలసీమ వ్యక్తిగా కనిపిస్తారు. ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటించగా, బ్రిటీష్ అధికారి సర్ థియోడర్ హెక్టోర్‌గా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నెగెటివ్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాకు ప్రధాన నేపథ్యం 1876–1878 మధ్యకాలంలో దక్షిణ మరియు పశ్చిమ భారతదేశంలో వచ్చిన భయంకరమైన కరువు (మద్రాస్ ఫ్యామిన్). తీవ్ర వర్షాభావం వల్ల వచ్చిన ఈ కరువును బ్రిటీష్ ప్రభుత్వ వైఫల్యాలు మరింత దారుణంగా మార్చాయి.

Also Read:ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు..నటి ఫిర్యాదు!

అప్పటి వైస్రాయ్ లార్డ్ లిట్టన్ అనుసరించిన క్రూరమైన వ్యాపార విధానాల వల్ల.. ఇక్కడ కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే, ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. ఈ కరువు వల్ల దాదాపు కోటి మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.టీజర్‌లో బ్రిటీష్ పాలనలోని దారుణమైన పరిస్థితులు, ఆకలి చావులు, దోపిడీ వంటి సన్నివేశాలను చూపించారు. బ్రిటీష్ సైన్యం ఆహారాన్ని కంట్రోల్ చేస్తూ ప్రజలను చిత్రహింసలకు గురిచేస్తుంటే, రణబలి వారికి ఎదురొడ్డి ఎలా పోరాడాడనేది టీజర్‌లో చూపించారు. ఈ కథలో ప్రతీకారం, ఆధ్యాత్మికత మరియు తిరుగుబాటు అంశాలు ముడిపడి ఉన్నాయి.ఈ భారీ చిత్రం 2026, అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -