మహిళలకు కేవలం ఐదు రూపాయలకే ఆటో ప్రయాణం అంటూ వినూత్న సేవకు శ్రీకారం చుట్టాడు ఓ యువ ఆటో డ్రైవర్. తిరుచానూరుకు చెందిన ఆటో డ్రైవర్ అజిత్ వినూత్న నిర్ణయం అందరిని ఆకట్టుకుంటోంది.
తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానూరు వరకు మహిళలకు కేవలం రూ.5కే ఆటో సేవలు అందిస్తున్నాడు అజిత్. ఒక్క మహిళ ప్రయాణించినా.. నలుగురు మహిళలు ప్రయాణించినా.. చార్జీ మాత్రం రూ.5 మాత్రమే.
షేరింగ్ ఆటోలోనే సాధారణంగా రూ.20 వరకు వసూలు చేస్తున్న పరిస్థితుల్లో.. కేవలం రూ.5కే సేవ..అభిమాన హీరో విజయ్ స్ఫూర్తితో ‘తుపాకీ ఆటో’ పేరుతో సేవలు మొదలు పెట్టాడు.సేవ చేయడానికి కోట్లు అక్కర్లేదు.. మంచి మనసుంటే చాలని చెబుతున్నాడు ఆటో డ్రైవర్ అజిత్.
Also Read:అసెంబ్లీ నుండి BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో మహిళలకు ఈ సేవలను కొనసాగిస్తానని..మహిళలకు అందిస్తున్న రూ.5 ఆటో సేవపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

