ఇషాన్ కిషన్‌పై ప్రశంసల జల్లు

1
- Advertisement -

దులీప్ ట్రోఫీ 2026-27 ఫైనల్‌లో ఈస్ట్ జోన్ మరియు సౌత్ జోన్ జట్లు తలపడ్డాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్, మొదటి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల కొండంత స్కోరును సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో పలువురు బ్యాటర్లు రాణించినప్పటికీ, ఇషాన్ కిషన్ ప్రదర్శన మ్యాచ్‌కే ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ముందుండి జట్టును నడిపించిన ఈస్ట్ జోన్ స్కిప్పర్ ఇషాన్, 270 రన్స్ చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్‌ను వీక్షించిన అనంతరం మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందిస్తూ, కిషన్ ఇటీవలి కాలంలో ఎంత స్థిరంగా రాణిస్తున్నాడో వివరించారు.

అతను పునరాగమనం చేసినప్పటి నుండి వరుసగా పరుగులు సాధిస్తున్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌ను కూడా అంతే ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఆడుతున్నాడు. ఎంతో అంకితభావం మరియు సహనంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ ఫార్మాట్‌లో పరుగులు చేసే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది, కానీ అతను దీన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేదు. ఇషాన్ కిషన్ జీవితంలో ఒకానొక దశలో అతను కాస్త దారి తప్పినట్లు కనిపించింది. మ్యాచ్‌లు ఆడటం ఇష్టం లేదని, బెంచ్‌కే పరిమితమవ్వడం నచ్చడం లేదని అన్న రోజులు ఉన్నాయి అని చోప్రా వ్యాఖ్యానించారు.

ఇషాన్ కిషన్ 270 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ అలాగే ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేయడం ద్వారా ఈ మ్యాచ్‌ ఫలితం దాదాపు ఈస్ట్ జోన్ వైపే మొగ్గుచూపిందని చోప్రా అభిప్రాయపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు సాధించిన అనంతరం, బౌలింగ్‌లోనూ ఈస్ట్ జోన్ విజృంభించడంతో సౌత్ జోన్ 61 ఓవర్లలో 189 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌లో కోలుకోవడానికి పోరాడుతోంది.

Also Read:BB10:సైన్యం టాస్క్‌లో మంటలు!

- Advertisement -