ఈ ఏడాది సినీ లవర్స్‌కి పండగే!

1
- Advertisement -

తెలుగు చిత్రసీమలో సరికొత్త కథలు, సంచలనాత్మక కాంబినేషన్లతో రాబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ రాబోయే క్రేజీ ప్రాజెక్ట్‌ల లైనప్‌పై స్పందిస్తూ ప్రేక్షకుల్లో మరియు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశారు.

ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్యల కాంబినేషన్‌లో రాబోతున్న EPIC చిత్రం ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని విజయ్ దేవరకొండ తెలిపారు. తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో వస్తున్న ది పారడైజ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పీరియడ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న రణబాలి చిత్రంపై విజయ్ ప్రత్యేక ఆసక్తి వ్యక్తం చేశారు. కన్నడ, తెలుగు ప్రేక్షకులను అలరించిన రష్మిక మందన్న సరికొత్త డిఫరెంట్ యాక్షన్ అవతార్‌లో మైసా చిత్రంతో అలరించబోతోంది.

Also Read:BB10:సైన్యం టాస్క్‌లో మంటలు!

డిసెంబర్ నెలాఖరున రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఫౌజీ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇయర్ ఎండ్‌లో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ దాదా థియేటర్లలో సందడి చేయనుంది.సినిమాల పరంగా ఈ ఏడాది ముగింపు చాలా సాలిడ్‌గా మరియు గ్రాండ్‌గా ఉండబోతోందని విజయ్ దేవరకొండ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -