విజయ్ ‘మీసా’ వ్యాఖ్యలపై దుమారం

1
- Advertisement -

తమిళనాడు స్పీకర్ ఛాంబర్ బయట డిఎంకే ధర్నాతమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలం నాటి ‘మీసా’ (MISA) చట్టంపై చేసిన వ్యాఖ్యలపై అధికార ద్రవిడ మున్నేట్ర ఖజగం (DMK) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ డిఎంకే ఎమ్మెల్యేలు, నాయకులు తమిళనాడు శాసనసభ స్పీకర్ ఛాంబర్ వెలుపల బైఠాయించి నిరసన చేపట్టారు.

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న టీవీకే పార్టీ అధినేత విజయ్, గతంలో ఎం.కరుణానిధి పాలన మరియు ఎమర్జెన్సీ సమయంలో అరెస్టుల ప్రస్తావన తెస్తూ ‘మీసా’ చట్టంపై కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు డిఎంకే చరిత్రను మరియు వారి నాయకుల త్యాగాలను కించపరిచేలా ఉన్నాయని డిఎంకే వర్గాలు ఆరోపించాయి.

డిఎంకే శాసనసభ్యులు అసెంబ్లీ కాంప్లెక్స్‌లోని స్పీకర్ ఛాంబర్ ముందు బైఠాయించి విజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిఎంకే చారిత్రక పోరాటాలను తక్కువ చేసి మాట్లాడినందుకు విజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిఎంకే నాయకులు డిమాండ్ చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయ్ పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించడంతో డిఎంకే మరియు టీవీకే మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.ఈ నిరసన కార్యక్రమంతో తమిళనాడు శాసనసభ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read:BB10 హౌస్‌లోకి బాలు-మీనా!

- Advertisement -