BB10 హౌస్‌లోకి బాలు-మీనా!

3
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ లో మొదటి రోజే అనూహ్య మలుపులు, తీవ్ర ఘర్షణలతో వాతావరణం వేడెక్కింది. అదే సమయంలో ‘గుండెనిండా గుడిగంటలు’ ధారావాహిక జంట బాలు, మీనా ప్రత్యేక అతిథులుగా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టడం సరికొత్త ట్విస్ట్‌గా మారింది.

ఈ ఎంట్రీ వెనుక బిగ్ బాస్ యాజమాన్యం ఒక ఊహించని బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. క్రేజీ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట రాకతో హౌస్‌లో సరికొత్త డ్రామా, ఆసక్తికరమైన మలుపులు మొదలవుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సర్‌ప్రైజ్ ఎంట్రీతో షో రేటింగ్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ అనూహ్య పరిణామాలు, పోటీదారుల మధ్య మొదలైన వ్యూహాలు బిగ్ బాస్ హౌస్‌లో మున్ముందు భారీ డ్రామాకు తెరలేపనున్నాయి.ఇంట్లో ప్రవేశించిన 16 మంది కంటెస్టెంట్లలో ఎవరూ ఇంకా అధికారికంగా ‘హౌస్ మేట్స్’ హోదా సాధించలేదని ఈ వారం నామినేషన్లు లేకపోయినా ఒకరికి ఎలిమినేషన్ ఖాయమని బిగ్ బాస్ కఠిన హెచ్చరిక జారీ చేశారు.

 

Also Read:ఎమ్మెల్సీలకు BRS త్రీలైన్ విప్ జారీ

- Advertisement -