BB10:రోహిత్ వర్సెస్ త్రిగుణ్ గొడవ

2
- Advertisement -

బిగ్ బాస్ సీజన్ మొదటి రోజే ఇంట్లో గొడవలు, వ్యూహాలతో వాతావరణం వేడెక్కింది. 16 మంది కంటెస్టెంట్లలో ఇంకా ఎవ్వరూ ‘హౌస్ మేట్స్’ కాలేదని, ఈ వారం నామినేషన్స్ లేకపోయినా ఎలిమినేషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని బిగ్ బాస్ తీవ్ర హెచ్చరిక చేశారు.

ఇప్పటికే ఎనిమిది మంది వద్ద ఉన్న ‘మ్యాజికల్ కీస్’ కాకుండా, మిగిలిన రెండు కీస్ కోసం వంశీ, కృష్ణుడు పేర్లను ఎంచుకోవడంతో చర్చ మొదలైంది. వాటర్ టాస్క్ సరిగ్గా చేయలేదంటూ రోహిత్‌పై త్రిగుణ్ పాయింట్ అవుట్ చేయడంతో ఇద్దరి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ప్రతీ విషయంలో రోహిత్‌ను త్రిగుణ్ టార్గెట్ చేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు కిచెన్ డ్యూటీ విషయంలో త్రిగుణ్, షాలినీ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది.

బిగ్ బాస్ రహస్యంగా కంటెస్టెంట్లకు పలు శక్తివంతమైన పవర్స్ కేటాయించారు:

త్రిగుణ్: టేక్ ఓవర్ (ఎదుటివారి పవర్ తీసుకోవడం)

ఝాన్సీ: ఎలిమినేషన్ నుంచి తప్పుకునే పవర్

కృష్ణుడు: స్వాప్ పవర్

శ్రిష్టి: డైరెక్ట్ నామినేషన్

రాం ప్రసాద్: సేఫ్ షీల్డ్

నరేష్: డబుల్ వోట్ పవర్

Also Read:వాకింగ్ చేస్తున్నా బ్లడ్ షుగర్ పెరుగుతోందా?

హౌస్ మేట్స్ హోదా పొందేందుకు సభ్యులందరినీ రెండు టీమ్‌లుగా విడిపోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ క్రమంలో లీడర్ల ఎంపికపై గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. అగ్నిపరీక్ష టీమ్ రోహిత్‌ను, సెలెబ్రిటీ టీమ్ రాం ప్రసాద్, త్రిగుణ్‌ను మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా షాలిని, శ్రిష్టి, రోహిత్ ఒకవైపు, త్రిగుణ్ మరొకవైపు తీవ్రస్థాయిలో వాదనలకు దిగారు. చివరికి బ్లూ టీమ్‌కు రాం ప్రసాద్, రెడ్ టీమ్‌కు రోహిత్ లీడర్లుగా ఎంపికవ్వడంతో మొదటి రోజు ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -