దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ దెవాల్డ్ బ్రెవిస్ అంతర్జాతీయ టి20 (T20I) క్రికెట్‌లో తన మాజీ సహచర ఆటగాడు జె.పి. డుమిని రికార్డును సమం చేశాడు. దీని ద్వారా టి20ల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో బ్యాటర్‌గా (సంయుక్తంగా) రికార్డు పుటలకెక్కాడు. ఆదివారం విండ్హోక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన ట్రై-సిరీస్ (ముక్కోణపు సిరీస్) ఫైనల్ మ్యాచ్‌లో బ్రెవిస్ ఈ ఘనత సాధించాడు. ఈ ట్రోఫీ పోరులో అతడు 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 129కి పైగా స్ట్రైక్ రేట్‌తో 32 పరుగులు చేశాడు.
దెవాల్డ్ బ్రెవిస్ 35 మ్యాచ్‌ల్లో 71 సిక్సర్లు బాదగా డుమిని 81 మ్యాచ్‌ల్లో 71 సిక్సర్లు కొట్టాడు. టి20ల్లో దక్షిణాఫ్రికా తరఫున టాప్-3 సిక్స్ హిట్టర్ల వివరాలను పరిశీలిస్తే..
డేవిడ్ మిల్లర్ – 139 సిక్సర్లు, క్వింటన్ డి కాక్ – 133 సిక్సర్లు,ఐడెన్ మార్క్రామ్ – 83 సిక్సర్లు కొట్టారు.
ఈ సిరీస్‌లో బ్రెవిస్ అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు. అతడు 5 ఇన్నింగ్స్‌లలో 56.50 సగటుతో, 166కి పైగా స్ట్రైక్ రేట్‌తో మొత్తం 226 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉండగా, అత్యధిక స్కోరు 75* (నాటౌట్). ఈ ఒక్క సిరీస్‌లోనే అతడు 16 సిక్సర్లు బాదాడు.ఇప్పటివరకు 35 T20Iలలో బ్రెవిస్ 33 ఇన్నింగ్స్‌లలో 30.76 సగటుతో, 163.94 స్ట్రైక్ రేట్‌తో 923 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ (అత్యధిక స్కోరు 125*), మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దమనకాండ

