తెలుగు బుల్లితెరపై తిరుగులేని ఆదరణ సొంతం చేసుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు 10వ సీజన్లోకి అడుగుపెట్టింది. ‘దశావతారాల’ కాన్సెప్ట్‌తో కింగ్ అక్కినేని నాగార్జున గ్రాండ్ హోస్ట్‌గా ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈసారి హౌస్‌లోకి మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. మొదటగా బెంగాల్‌కు చెందిన ప్రముఖ సీరియల్ నటి దేబ్జాని మోడక్ ఎంట్రీ ఇవ్వగా, నాగార్జునపై ఉన్న అభిమానంతో పాట పాడి అలరించింది. ఆ తర్వాత హీరో త్రిగుణ్ స్టైలిష్‌గా అడుగుపెట్టగా, ‘అగ్నిపరీక్ష’ టాస్క్ గెలిచి రైతు బిడ్డ, గాయని ఝాన్సీ మూడో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వచ్చింది. నాలుగో కంటెస్టెంట్‌గా ఇంటర్వ్యూయర్ సుధీర్ రెడ్డి ఎంటర్ అవ్వగా, ఐదో కంటెస్టెంట్‌గా ఆడియన్స్ పోల్ ద్వారా కామనర్ అమన్ ఎంపికయ్యాడు. ఈ వేడుకలో ‘సర్దార్ 2’ టీమ్ నుంచి హీరో కార్తీ, ఎస్.జె. సూర్య ప్రత్యేక సందడి చేశారు.
ఆరో కంటెస్టెంట్‌గా ‘గుప్పెడంత మనసు’ ఫేమ్, సీరియల్ నటి చైత్ర రాయ్ ,ఏడో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ రాంప్రసాద్, ఎనిమిదో కంటెస్టెంట్‌గా నవదీప్ రికమండేషన్‌తో జ్యూరీ ద్వారా షాలిని హౌస్‌లోకి వచ్చారు. తొమ్మిదో కంటెస్టెంట్‌గా ‘టెంపర్’ ఫేమ్ నటుడు వంశీ ఎంట్రీ ఇవ్వగా, పదో కంటెస్టెంట్‌గా జ్యూరీ సెలెక్ట్ చేసిన శ్రీష్టి అడుగుపెట్టింది.
పదకొండో కంటెస్టెంట్‌గా జబర్దస్త్ పొట్టి నరేష్, పన్నెండో కంటెస్టెంట్‌గా చలాకీతనంతో ఆకట్టుకున్న చరణ్ హౌస్‌లోకి వచ్చారు. పదమూడో కంటెస్టెంట్‌గా ‘వినాయకుడు’ సినిమా ఫేమ్ కృష్ణుడు తన రీఎంట్రీ కోసం బిగ్ బాస్ వేదికను ఎంచుకున్నాడు. పద్నాలుగో కంటెస్టెంట్‌గా గ్లామరస్ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ అడుగుపెట్టి గ్లామర్ డోస్ పెంచింది. పదిహేనో కంటెస్టెంట్‌గా బిందు మాధవి ఎంపిక చేసిన రోహిత్ ఎంట్రీ ఇవ్వగా, చివరిగా పదహారో కంటెస్టెంట్‌గా కన్నడ నటుడు నిహార్ ముకేష్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
Also Read:దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్
మొత్తానికి విభిన్న రకాల పోటీదారులు, కామన్ జనాలు మరియు సెలబ్రిటీల కలయికతో బిగ్ బాస్ సీజన్ 10 వినోదభరితంగా మొదలైంది.

