కేసు పెట్టాల్సింది రేవంత్ పైనే!

1
- Advertisement -

సిద్ధిపేట పాత బస్ స్టాండ్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. సమస్యలపై పోరాడుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను హెచ్చరిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో డీఏలు, సరెండర్ లీవులు, పీఆర్సీలు రాక పోలీసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పోలీసులకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని గుర్తుచేశారు.

విద్యార్థుల హక్కుల కోసం తాము అండగా ఉంటామని స్పష్టం చేస్తూ, “మా పిల్లలను ఒక్క దెబ్బ కొట్టినా హరీష్ రావు అడ్డంగా ఉంటాడు.. ఖబర్దార్!” అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చట్టపరంగా కేసులు పెట్టాల్సి వస్తే ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే పెట్టాలని డిమాండ్ చేశారు.

సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకుండా పేద విద్యార్థుల చదువులను ఆగం చేసినందుకు రేవంత్ రెడ్డిపైనే కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బాండ్ పేపర్లు పంపి నిరుద్యోగులను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Also Read:భారీ వర్షాలు..ఢిల్లీకి ఎల్లో అలెర్ట్!

- Advertisement -