టిబెట్-నేపాల్ సరిహద్దులో సంభవించిన హిమపాతం మరియు కొండచరియలు విరిగిపడటంతో నేపాల్‌లోని త్రిశూలి నది ఉగ్రరూపం దాల్చింది. ఈ జలప్రళయంలో నది వెడల్పు ఏకంగా 6 రెట్లు పెరిగి వందలాది ఇళ్లను, గ్రామాలను మింగేసింది. ఇందుకు సంబంధించిన ఉపగ్రహా చిత్రాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆగస్టు 26 ఉదయం టిబెట్-నేపాల్ సరిహద్దులో మంచు, రాళ్లతో కూడిన కొండచరియలు విరిగిపడటంతో రసువా, నువాకోట్, లలిత్‌పూర్ జిల్లాల్లో వినాశనం చోటుచేసుకుంది. పచ్చని కొండలు బురద, రాళ్ల కుప్పలుగా మారాయి. కొన్ని గంటల వ్యవధిలోనే నదీ లోయలు 6 రెట్లు వెడల్పుగా మారిపోయాయి.
రసువా జిల్లాలోని సరిహద్దు పట్టణమైన టిమురే వద్ద త్రిశూలి నది వెడల్పు అంతకుముందు 78 మీటర్లు ఉండగా, వరదల తర్వాత ఏకంగా 350 మీటర్లకు (4 రెట్లకు పైగా) పెరిగింది.స్యాబ్రుబెసిలో ఇక్కడ నది సాధారణ వెడల్పు 65 మీటర్లు కాగా ప్రళయం తర్వాత 300 మీటర్లకు విస్తరించింది. ఇక్కడే దాదాపు 300 ఇళ్లు నదిలో కొట్టుకుపోయాయి.
చౌప్‌థోకే తీవ్రంగా ప్రభావితమైన నువాకోట్ జిల్లాలోని చౌప్‌థోకే వద్ద నది 65 మీటర్ల నుండి ఏకంగా 443 మీటర్లకు (దాదాపు 6 రెట్లు) ఉప్పొంగింది. బట్టార్ ప్రాంతంలో నువాకోట్ జిల్లాలోని బట్టార్‌లో నది వెడల్పు 91 మీటర్ల నుండి 309 మీటర్లకు పెరిగింది. ఈ ప్రకృతి విపత్తులో నేపాల్‌లో 1,200 మందికి పైగా మరణించగా, 5,083 మంది గల్లంతయ్యారు. చైనా వైపు 21 మంది మరణించగా, 541 మంది కనిపించకుండా పోయారు. దీంతో ఈ ప్రళయంలో మొత్తం మరణాల సంఖ్య 1,280కి చేరుకోగా, 5,624 మంది ఇంకా గల్లంతై ఉన్నారు.
From 65 metres to 443 metres.
In just hours, Nepal’s floods transformed entire river valleys.
Using before-and-after satellite imagery, @NDTV Datafy tracked how the Trishuli River and its tributaries widened, shifted course and consumed large stretches of land across Nuwakot,… pic.twitter.com/OmiiAnKFBS
— Rahul Kanwal (@rahulkanwal) September 3, 2026

