రేవంత్ రెడ్డి తనను అడుగడుగునా అవమానించాడని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు కొండా సురేఖ. ఆగస్టు 22న సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్‌కు, ఆగస్టు 23న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మీనాక్షి నటరాజన్‌కు రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు కొండా సురేఖ.
సీఎం రేవంత్ రెడ్డి నన్ను రాజకీయంగా, పరిపాలనాపరంగా మొదటి నుంచే అణచివేస్తున్నాడు..నా శాఖల్లో నా నిర్ణయాధికారాన్ని తగ్గించి సీఎంవో నేరుగా ఆదేశాలు ఇస్తోంది..దీంతో నా మంత్రిత్వ శాఖలో నా పాత్ర నామమాత్రంగా మారింది…యాదాద్రి దేవస్థానం ట్రస్టు బోర్డు ఏర్పాటు గురించి నాకు సమాచారం ఇవ్వలేదు అన్నారు.
సమ్మక్క-సారలమ్మ దేవాలయ శాశ్వత అభివృద్ధికి సంబంధించిన నిధులను నాకు తెలియకుండా ఒక్క రోజులోనే R&B శాఖకు బదిలీ చేశాడు..నా మాజీ ఓఎస్డీ సుమంత్‌ను నాకు తెలియకుండానే తొలగించి, అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులను నా ఇంటికి పంపి మంత్రి హోదాను అవమానించాడు అన్నారు.
నా నియోజకవర్గ అభివృద్ధికి నిధుల విషయంలో వివక్ష చూపాడు…కడియం శ్రీహరి నాకు చెప్పకుండా దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాడు.. దీనిపై నేను ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు…ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎమ్మెల్యేలను, ఎంపీలను, నేతలను నాకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బందులు పెట్టాడు…నా కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారు అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు ఇతరులు చేస్తే వారిపై చర్యలు తీసుకోకుండా నన్ను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు…బీసీ మహిళా మంత్రిని కావడం వల్లే నా మీద ఇలాంటి కుట్రలు చేస్తున్నారు…నా కుటుంబంపై జరుగుతున్నవన్నీ రాజకీయ దాడులే. నేను చెప్పనివి ఇంకా అనేక ఘటనలు ఉన్నాయి…నా ఆరోపణలకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలతో పెన్‌డ్రైవ్‌ను లేఖలకు జత చేస్తున్నా అంటూ రేవంత్ రెడ్డిపై సంచలన విమర్శలు చేస్తూ సోనియాగాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మీనాక్షి నటరాజన్‌కు పది పేజీల లేఖలు రాశారు కొండా సురేఖ.
Also Read:ISRO:గగన్‌యాన్ అప్డేట్

