బిష్కెక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ల మధ్య జరిగిన సమావేశం అనంతరం భారత్, ఇరాన్‌లు వ్యాపార ఒప్పందం వైపు అడుగులు వేస్తున్నాయన్న వార్తలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. అయితే, అమెరికా విధించిన ఆంక్షలను అధిగమించడానికి ఇరాన్‌కు సహాయపడే దేశాలు కూడా తీవ్ర పరిణామాలు మరియు ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ప్రధాని మోదీ, పెజెష్కియాన్ భేటీ తర్వాత న్యూఢిల్లీ-తేహ్రాన్లు ఒక కీలక వేదికపై వర్తక ఒప్పందం దిశగా వెళ్తున్నాయనే కథనాల మధ్య రూబియో స్పందించారు.భారత్, ఇరాన్‌ల మధ్య ఎలాంటి కొత్త వర్తక ఒప్పందం జరుగుతోందని నేను భావించడం లేదు” అని ‘ది బ్రయాన్ కిల్మీడ్ షో’ ఇంటర్వ్యూలో రూబియో తెలిపారు.ప్రపంచంలోని ప్రతి దేశానికి స్వతంత్ర విదేశాంగ విధానం ఉంటుందని, ఇరాన్ ప్రభుత్వంతో చాలా దేశాలు సంబంధాలు కొనసాగిస్తున్నాయని ఆయన అంగీకరించారు. స్వయంగా అమెరికా కూడా కొన్ని చర్చల విషయంలో ఇరాన్ ప్రతినిధులతో మాట్లాడిందని ఆయన గుర్తుచేశారు.
అయితే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పునరుద్ఘాటిస్తూ, ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్‌కు ఏ దేశం కూడా సాయం చేయకూడదని రూబియో హెచ్చరించారు.అంతిమంగా జరిగేది ఏమిటంటే — అధ్యక్షుడు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు — ఆంక్షల నుండి తప్పించుకోవడానికి ఇరాన్‌కు ఏ దేశం సహకరించకూడదు అని అన్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి, అణు ఆయుధాలను తయారు చేయడానికి ఇరాన్ ఆదాయాన్ని గడించే మార్గాలను ఏర్పాటు చేయడంలో ఏ దేశమూ సహాయం చేయకూడదు. ఒకవేళ ఏ దేశమైనా అలా చేయడానికి పూనుకుంటే, మేము ఆ దేశాలపై కూడా ఆంక్షలు విధించాల్సి ఉంటుంది” అని స్పష్టం చేశారు.
ఇరాన్ అణు ఆయుధాన్ని కలిగి ఉండకుండా చూడటమే ట్రంప్ పరిపాలనా యంత్రాంగం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని పొందేందుకు అనుమతించబోము, ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ పదవిలో ఉన్నంత వరకు అది జరగదు” అని పేర్కొన్నారు.టెహ్రాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు వాషింగ్టన్ ప్రధానంగా ఆర్థిక ఆంక్షలనే ఆయుధంగా వాడుతోందని, అయితే అవసరమైనప్పుడు సైనిక బలాన్ని ఉపయోగించే హక్కు తమకు ఉందని రూబియో చెప్పారు. ఇరాన్ తమ ఆర్థిక వనరులను ప్రజల సంక్షేమం కోసం కాకుండా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి మరియు అణు ఆయుధాలు సాధించడానికే ఉపయోగిస్తోందని ఆరోపించారు.
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం ప్రారంభమై ఆరు నెలలు గడిచినా పరిస్థితులు సద్దుమణగలేదు. అమెరికా దళాలు ఇరాన్ స్థావరాలపై “భారీ దాడి” చేశాయని, తాము ఎప్పుడు అనుకుంటే అప్పుడు మరొక దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
Also Read:తెలంగాణకు పట్టిన శని..కాంగ్రెస్

