తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ పార్టీ అసమర్థ అరాచక పాలన 100 రోజుల పాలన పైన KTR ఒక ఛార్జ్ షీట్ ని భారత రాష్ట్ర సమితి తరఫున విడుదల చేశారు. ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన పైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే 1000 రోజుల పాలన అంటే ఇది పాలన కాదు ప్రజా ప్రజాపీడన అన్నారు. ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శనికి 1000 రోజులు నిండాయి అన్నారు. ప్రజల పైన కాంగ్రెస్ పార్టీ దండయాత్ర మొదలుపెట్టి సరిగ్గా 100 రోజులు అయింది అన్నారు. ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. 100 రోజుల్లో అన్ని పనులు చేస్తామని చెప్పి 1000 రోజులు అయినా తెలంగాణ ప్రజలకు నిత్య నరకం చూపిస్తున్నారు అన్నారు. KCR గారు చెప్పినట్టు ఇది ఒక సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వభ్రష్ట ప్రభుత్వం అన్నారు. ఈ 1000 రోజుల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే ఒక క్రిమినల్ వేస్ట్ అని KTR అన్నారు. ఆర్థిక విధ్వంసం నుంచి సామాజిక సంక్షోభం సాంస్కృతిక విద్రోహం అన్ని రంగాల్లో 1000 రోజుల పాటు తెలంగాణలో కొనసాగిందన్నారు. అజ్ఞానం అబద్ధం అరాచకం అవినీతి నాలుగు తలలు గుసకొడుతున్న అనుముల నాగు పాము పాలన ఇది అన్నారు. 1000 రోజుల పాలనలో రైతన్నల నుంచి ఆడబిడ్డల దాకా నిరుద్యోగులు విద్యార్థులు సబ్బండ వర్గాలు కులవృత్తులు ఇలా అందరినీ అష్ట కష్టాలు పెట్టిందన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం చేసిన అరాచకపు పాలన ఇది అన్నారు.
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు 13 డిక్లరేషన్లు ఆరు గ్యారెంటీలతో చేసిన మోసం అతిపెద్ద దారుణమైన ద్రోహం అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన 1000 రోజుల పాలన పైన రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అందుకే విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలు అన్నదాతలు రైతన్నలు ఇలా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడుతున్నారు అన్నారు. నిరసనలతోని తిరగబడుతున్నారు అన్నారు. 30% కమిషన్లు పర్సెంటేజీలు తీసుకుంటున్న అవినీతి అరాచక పాలన కాంగ్రెస్ పాలన అన్నారు. కనీసం 100 రోజుల పూర్తి అయిన సందర్భంగా అయినా హైదరాబాద్ లో ఉండి తమ గొప్పలు చెప్పుకుంటారు అనుకుంటే ఢిల్లీకి వెళ్లి తమ అవినీతి సొమ్ముల వాటాల పంపిణీని పంచాది పెట్టుకుంటున్నారు అన్నారు. ఢిల్లీకి గులాములుగా మారి తమ స్వతంత్రాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఈ 100 రోజుల పాలన అన్నారు. ఒక్కటంటే ఒక్క రూపాయి లాభం ప్రజలకు చేయకున్నా నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిన అవినీతి పాలన కాంగ్రెస్ పాలన అన్నారు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు సున్నాలు వేస్తూ రిబ్బన్ కటింగ్ లు చేసుకుంటూ టైం పాస్ చేస్తున్న పాలన కాంగ్రెస్ ది అన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు లాటీలు లూటీలు నేరాలు ఘోరాలు వెకిలి మాటలు మకిలి చేతులు ఇదే కాంగ్రెస్ పాలన అన్నారు. మంత్రివర్గంలో కీచులాటలు తన్నులాటలు ఎంగిలి మెతుకుల కోసం కుక్కలు కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటున్న పరిస్థితి ఈరోజు ఉంది అన్నారు. జెంజీ భాషలో చెప్పాలి అంటే ఈ 100 రోజుల పాలన గురించి అంటే అసమర్థత ప్రో మాక్స్ అవినీతి అల్ట్రా మాక్స్ అరాచకం ఐమాక్స్ అన్నారు.
అందుకే రాష్ట్రంలోని ప్రతి ఒక్క వర్గం 100 రోజుల కాంగ్రెస్ పాలన పైన ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ద్రోహాన్ని అవినీతిని అరాచకాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరగబడాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో మళ్ళీ తిరిగి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. రైతన్నల చేతికి బేడీలు వేసిందన్నారు. విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందన్నారు. 12000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయలతో విద్యార్థుల జీవితాలను ఆగమం చేస్తున్నారన్నారు. ఒకనాటి లాభసాటి వ్యవసాయాన్ని ఈరోజు మళ్ళీ తెర్లు చేసిందన్నారు. 100 రోజుల్లో కాంగ్రెస్ సాధించింది ఏమన్నా ఉంది అంటే 100 మంది రైతన్నల ఆత్మహత్యలు చేసుకునేలా చేయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో రైతన్నలకు రైతు భరోసా ఇవ్వకపోవడం ఎగవేయడం రైతు భీమాను బందు చేయడం యూరియా ఇవ్వక యూరియా ఇవ్వకుండా ధాన్యం కొనకుండా పంటలు కొనకుండా చేస్తున్న తీరు వల్ల అనేకమంది రైతన్నలు నష్టాలపాలై ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉందన్నారు. ఒక్క బ్యారేజ్ ఒక్క ప్రాజెక్టు ఒక్క చెరువు కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా చెక్ డ్యామ్‌లను పేల్చిన క్రిమినల్లా మాదిరిగా తయారైందన్నారు. సుంకిశాల ఎస్ఎల్బిసి టన్నెల్ వంటి అనేక ప్రమాదాలు జరిగిన ఒక్కరిపైనా చర్య తీసుకోలేదన్నారు. గురుదక్షిణగా గోదావరి నీళ్లను తెలంగాణ జలహక్కులను చంద్రబాబుకి సమర్పించుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో 100 రోజులలో 100 రోజుల్లో తెలంగాణ జల హక్కులకు తీరని నష్టం జరిగిందన్నారు.
విద్యార్థులు జాబ్ క్యాలెండర్ అడిగితే లాటీలు జులిపిస్తున్నారు అన్నారు. ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే విద్యార్థుల పైన దాడులు చేయిస్తున్నారన్నారు. జాబ్ లేని జాబ్ క్యాలెండర్ ని ప్రకటించిందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయాయో చెప్పాలన్నారు. ఏడాడి దాటి మూడేళ్ళు దాటిన ఉద్యోగాల భర్తీ ఊసే లేదన్నారు. నిరుద్యోగులు విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పైన రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఒకనాటి ఓట్లు వేయించిన నిరుద్యోగులు విద్యార్థులే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు పిండాలు పెడతారన్నారు. 150 మంది గురుకుల విద్యార్థులను చంపిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది అన్నారు. 27000 ప్రభుత్వ పాఠశాలలు కేవలం 4000 కే కుదిస్తా అని చెబుతున్న అరాచకపు ప్రభుత్వం ఇది అన్నారు. విశ్వవిద్యాలయాల భూములను అమ్ముకొని సుప్రీంకోర్టు చేతిలో చివాట్లు తిన్న ప్రభుత్వం ఇది అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు జీవో 97 పేరుతో వారి జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పాలన చూసిన తర్వాత రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్ లేదు పచ్చ కాంగ్రెస్ లేదు ఉన్నది కేవలం లుచ్చా కాంగ్రెస్ మాత్రమే అని తెలంగాణ విద్యార్థులు అనుకుంటున్నారని KTR అన్నారు.ఇక అడ్డగోలుగా 1000 రోజుల్లో సంపాదించుకున్న అక్రమ సంపాదన విషయంలో విభేదాల వలనే ఈరోజు మంత్రులు బయటకు వచ్చి మరీ బహిరంగంగా తన్నుకుంటున్నారు అన్నారు. 30% కమిషన్ లేకపోతే ఒక్క పని చేయని 1000 రోజుల పాలనలో సంపాదించిన అడ్డగోలు నిధుల కోసమే కుంభకోణాల్లో వాటాల కోసమే పబ్లిక్ గా కొట్లాడుతున్నారు అన్నారు.
అందుకే ఈరోజు స్వయంగా మంత్రులు, మంత్రుల కుటుంబ సభ్యులు బయటకు వచ్చి గొడవలు పెట్టుకుంటున్నారు అన్నారు. ఒకరి లీలలను ఇంకొకరు బయట పెడుతున్నారు అన్నారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎంత బాహాటంగా దోపిడీ చేస్తున్నారో కొండ సురేఖ గారి కూతురే బహిరంగంగా చెప్పింది అన్నారు. ఇంత చెప్పిన తర్వాత కూడా వారి అవినీతి పైన ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మంత్రులే స్వయంగా 30 వేల కోట్ల రూపాయల నైనీ టెండర్ల కుంభకోణాన్ని ఆపాలని చెప్తున్నారు అన్నారు. ఆనకొండ బ్రదర్స్ అనుముల బ్రదర్స్ ఆనకొండ బ్రదర్స్ గా మారిపోయారన్నారు. రేవంత్ రెడ్డి అనుచరులు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు కుంభకోణాలు చేస్తున్నారు అన్నారు.ఈ సందర్భంగా కేటీఆర్ 1000 రోజుల పాలనలో జరిగిన దాదాపు 30 స్కాములను చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం పైన వేసిన చార్జిషీట్లో ఈ స్కాముల జాబితాను ఉంచారు.ఇక కేసీఆర్ రాజీనామా అంశం పైన డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతల పైన ముఖ్యమంత్రి మాటల పైన కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారే కాదు అని, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఉండేదా అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం మూమటికి కేసీఆర్ వల్లనే సాధ్యమైంది అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు అన్నారు. అట్లాంటిది కేటీఆర్ కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డికి కుర్చీ దక్కిందని గుర్తుంచుకోవాలన్నారు.
సింగపూర్ కు చెందిన లీ కువాన్ యూ మాదిరిగా కేసీఆర్ ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు గౌరవమిచ్చి గౌరవించుకున్న తీరుగానే కేసీఆర్ ను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతటి స్థాయి కలిగిన వ్యక్తి రాజీనామా చేయాలి అంటే చేయాలనే నైతిక అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదన్నారు. కేసీఆర్ రాజీనామాలు చేస్తే ఏం జరుగుతుందో సోనియా గాంధీకి తెలుసు అన్నారు. గతంలో రాజీనామా చేసిన కేసీఆర్ వలనే ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం గడగడలాడిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. అట్లాంటిది కేసీఆర్ రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి లాంటి అర్బకుడు తట్టుకునే పరిస్థితి ఉండదు అన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి ప్రజల ఆశీర్వాదంతో వస్తారన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా తీవ్రంగా దెబ్బతిందని, రాష్ట్ర స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. కేవలం ఎక్సైజ్ పెరగడం తప్పించి మిగిలిన అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిందన్నారు. 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ రెడ్డి దాని తన కమిషన్ల కోసం కాంట్రాక్ట్‌ల కోసం తప్పించి ఇంకా ఎక్కడ వాడారో చెప్పాలన్నారు. ఇక రేవంత్ రెడ్డి 1000 రోజుల కాలంలో చేసిన అనేక అజ్ఞానపు మాటలను కేటీఆర్ ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాల అరాచకాలు చేసినా ప్రతిపక్షంగా తమ పాత్రను కొనసాగిస్తూనే ఉంటామని 1000 రోజుల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడికక్కడ అనేక అంశాల్లో బుద్ధి చెప్పి ప్రజల మద్దతుతో బుద్ధి చెప్పి తమ బాధ్యత నిర్వర్తించామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజుల కాలంలో అంబేద్కర్ చెప్పినట్లు బోధించు సమీకరించు పోరాడు అన్న మార్గంలో ముందుకు పోతూ పోరాడుతున్నామన్నారు. శాసనసభ సమావేశాల్లోనూ కాంగ్రెస్ పైన గొంతు విప్పుతామని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే 1000 రోజుల పాలన పైన పార్టీ ఒక్క వారం రోజుల ప్రణాళిక ప్రకటించిందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అని 1000 రోజుల తర్వాత అనేక 1000 రోజుల కాంగ్రెస్ పాలన పైన భవిష్యత్తులోనూ విస్తృతమైన కార్యాచరణతో ముందుకు పోతామన్నారు.
విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ ఇంజనీరింగ్ విద్య వేస్ట్ అన్నటువంటి రేవంత్ రెడ్డి ఒక్క అక్షరం తప్పు లేకుండా ఒక పేపర్ పైన ఇష్టం వచ్చిన భాషలో ఒక పేజీ రాయగలిగితే రానున్న అసెంబ్లీ సమావేశంలో మేమంతా రాజీనామా చేసి పోతామని కేటీఆర్ అన్నారు.ఇక మహిళలు ఆడబిడ్డలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మోసం చేసిందన్నారు. 2500 నెలకి ఇస్తామని చెప్పి మోసం చేసిందని అది సరిపోకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి వాటిని దాదాపుగా రద్దు చేసిందన్నారు.
మహిళలను కోటీశ్వరులు చేయడం పక్కన పెట్టి వారికి ఇస్తామని చెప్పి పెండింగ్ లో ఉన్న సుమారు 80 వేలకు పైగా బకాయిలను చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.మహిళల కోసం ఉన్న కెసిఆర్ కిట్, కళ్యాణ లక్ష్మి, తూల బంగారమ్ వంటి అన్నింటినీ పక్కన పెట్టిందన్నారు. ఇక ఆశా వర్కర్లకు సంబంధించి జీతం పెంచమంటే వారిపైన లాఠీ ఛార్జ్ చేస్తున్నారు అన్నారు. 1000 రోజుల పాలనలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. ఉన్న పెన్షన్ ను కూడా మూడున్నర లక్షలు ఊడగొట్టిందన్నారు.
సబ్బండ వర్గాలను సంక్షోభంలోకి నెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్రమైన ద్రోహం చేసిందన్నారు. బీసీలకు ప్రతి ఏటా 20 వేల కోట్లు ఇస్తామని చెప్పి మూడు సంవత్సరాల్లో కేవలం 5000 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. దీనితోపాటు మైనారిటీలకు కూడా 4000 రూపాయల 4000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి నామమాత్రంగా ఖర్చు పెట్టారన్నారు. బీసీల వాటాను తగ్గించి స్థానిక సంస్థల ఎన్నికల్లో తీరని ద్రోహం చేశారన్నారు. చెల్లని ఒక బీసీ బిల్లు తీసుకొచ్చి వారిని మాయ చేసే ప్రయత్నం చేశారన్నారు.
కుల వృత్తుల మీద పగబట్టి వారికి గతంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గొర్రెలు, చేపల పంపిణీ వాటి కార్యక్రమాలను ఆపేశారు అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కు తూట్లు పొడిచి ఆయా వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డమెందుతున్నారు అన్నారు. ఇక బీసీలను ఎమ్మెల్యేలు చేసినా, మంత్రులు చేసినా అంటూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారన్నారు. దీనితోపాటు మైనారిటీలకు చదవడం చేతకాదు అంటూ అవమానకరంగా మాట్లాడారన్నారు. ఇక దళిత్ గిరిజనులకు 12%, 18% బీసీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ కాంట్రాక్టులలో విదర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు.అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈరోజు చార్జ్ షీట్ వేస్తున్నామన్నారు.ఇక విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులకు తీరని ద్రోహం చేసిందన్నారు. పిఆర్సి ఊసే తడవలేదని ఆరు డిఏ లు పెండింగ్ లో పెట్టిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే అన్నారు. ముఖ్యమంత్రి పిఆర్సి అడిగితే ఉద్యోగులను బెదిరిస్తున్నారు అన్నారు. ఇక ఆర్టీసీ సింగరేణి ఆటో డ్రైవర్లకు కూడా తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న కాంగ్రెస్ స్పందించలేదు అన్నారు.
ఇక సింగరేణికి సంబంధించి నల్ల బంగారాన్ని దొంగల దోచుకుంటున్నారు అన్నారు. సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ల పేరుతో భారీ కుంభకోణాలకు తెరలేపారన్నారు. దీంతోపాటు అనేక సింగరేణి కుంభకోణాలకు తెరలేపి భారీగా దోచుకుంటున్నారు అన్నారు. అంగన్వాడీ లకు జీతం పెంచుతామని చెప్పి అడిగితే ఇప్పుడు వారిని అరెస్టులు చేస్తున్నారు అన్నారు. ఒకనాడు గ్రామాలు, పట్టణాల్లో పట్టణ ప్రగతి, గ్రామ ప్రగతితో అద్భుతంగా జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న పల్లెలు, పట్టణాలు ఈరోజు కాంగ్రెస్ పాలనలో కునారిల్లిపోయాయి అన్నారు. మూడు సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ద్వారా పట్టణాలకు ఇయ్యలేదన్నారు. కనీసం పారిశుద్ధ నిర్వహణ చేయకుండా వాటిని సంక్షోభంలోకి నెడుతున్నారు అన్నారు.
Also Read:బోడ కాకరకాయ..ప్రయోజనాలు!
ఇక 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లే సెటిల్మెంట్లు అడ్డాగా మారిపోయి మారిపోయింది అన్నారు. డైరెక్ట్ గా పారిశ్రామిక వేత్తలను పిలిచి వారి నెత్తికి తుపాకీ పెట్టి బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి ఉందన్నారు. విశ్వనగరం హైదరాబాద్ రాష్ట్ర ఆర్థిక ఇంజన్ హైదరాబాద్ ని పూర్తిగా కుప్పకూల్చారు అన్నారు. రాష్ట్రంలో 22 పేరిట లక్షల కోట్ల ఎకరాలను ఆస్తులను చెరపట్టారు అన్నారు. 30% కమిషన్లు ఇస్తేనే ఆయా ఆస్తులను నిషేధిత జాబితా నుంచి తీసేస్తామని సెటిల్మెంట్లు చేస్తున్నారు అన్నారు. హైదరాబాద్ నగరంలో భారీగా ఆరా టాక్స్ వసూలు చేస్తున్నారు అన్నారు.
ఇక రాష్ట్రంలో పట్టపగలే చోరీలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు రేపులు కొనసాగుతున్నాయి అన్నారు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే పోక్సో నిందితులకు అండగా నిలబడిందన్నారు. రాష్ట్ర రాజధానిలో ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేసి ప్రజా రవాణా వ్యవస్థకు దెబ్బకొట్టారన్నారు. హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాలు లేని కరెంటు కోతలు తిరిగి వచ్చాయి అన్నారు. హైదరాబాద్ నగరంలో కనీసం పారిశుద్ధ నిర్వహణ కూడా చేయలేని పరిస్థితికి ప్రభుత్వం పడిపోయింది అన్నారు.ఇక హైదరాబాద్ నగరాన్ని రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మంత్రులు తమకు ఏటిఎం గా మార్చుకొని విలువైన భూములపైన కన్నువేసి బెదిరింపులకు దిగుతూ గుండా ఈజం చేస్తున్నారు అన్నారు. గతంలో కేసిఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ లు చేసుకుంటూ కాలయాపన చేస్తున్న చేశారు చేశారన్నారు. బస్తి దావఖానాలు, టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం వంటి అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడింది అన్నారు. ఇక తెలంగాణ రైజింగ్ అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం అది కేవలం నేరాలు, ఘోరాలు, విధ్వంసంలోనే అన్నారు. హైద్రా పేరుతో భారీగా ప్రజలను ఆస్తులపైన కన్నేసి కూలగొడుతూ చేసిన విధ్వంసాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన కూడా జర్నలిస్టులపైన, రైతులపైన అక్రమ కేసులు పెట్టి బేడీలు వేసి జైలుకు పంపుతున్నారు అన్నారు. విద్యార్థుల గొంతు పిసికి చంపే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.హైద్రా విషయంలో హైకోర్టు ఎన్ని అక్షింతలు వేసినా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు రాలేదన్నారు.

