తెలంగాణ యువతకు బీజేపీపైన ఆశలు లేవు అని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. 2023 ఎన్నికల ముందు యువత బీజేపీ వైపు చూసింది కానీ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీకి తెలంగాణ యువతలో మద్దతు తగ్గిపోయింది అని తెలిపింది.
కార్పొరేషన్ ఎన్నికల సర్వేలో 11 మంది బీజేపీ కార్పొరేటర్లు అందరూ ఓడిపోతున్నారని తేలింది… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక నియోజకవర్గాల్లో బీజేపీ గ్రాఫ్ 50% కంటే ఎక్కువ దిగజారిపోయింది అని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది.
రాబోయే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు స్పష్టంగా ఉంది… బీఆర్ఎస్ తరఫు నుండి వరంగల్‌లో ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుస్తాడు అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు బీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పెరిగింది… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కేవలం 1 శాతం ఓటు పర్సెంటేజ్ ఎక్కువతో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ గ్రాఫ్ 5 శాతం పెరిగింది అన్నారు.
మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లోని 74 డివిజన్లలో 48-50 సీట్లు బీఆర్ఎస్ వన్ సైడెడ్ విక్టరీ కొడుతుంది… సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా వన్ సైడెడ్‌గా బీఆర్ఎస్ విజయం సాధించబోతుంది… హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వరకు ఎంఐఎం, కాంగ్రెస్ పొత్తులో వెళ్లి విజయం సాధించే అవకాశం ఉంది అని చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది.
Also Read:అందరికి నచ్చే..‘కూర్మ అవతార్’

