నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మైసా’ (Mysaa) విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. భారీ అంచనాలు ఉన్న ఈ మహిళా ప్రాధాన్య చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026, నవంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ చూడని సరికొత్త, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రష్మిక పాత్ర చాలా శక్తివంతంగా, విభిన్నమైన షేడ్స్‌తో ఉండబోతోందని సమాచారం.
అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మాతలు రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు పాన్-ఇండియా స్థాయిలో ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ సినిమాను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read:రాహుల్ అసత్యప్రచారం..మోదీ ఫైర్
రష్మిక వరుస పాన్-ఇండియా విజయాలతో జోరు మీదున్న నేపథ్యంలో నవంబర్ 27న రాబోతున్న ‘మైసా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు, సినీ విశ్లేషకులు ఆశిస్తున్నారు.

