వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బొత్స సత్యనారాయణను లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
బొత్స సత్యనారాయణకు సరిగ్గా మాట్లాడటమే రాదని, ఆయనొక ‘నత్తోడు.. పిచ్చోడు’ అని పాల్ వ్యాఖ్యానించారు. సొంతగా ఏ విషయమూ మాట్లాడలేక, అర్థం పర్థం లేకుండా మీడియా ముందుకు వచ్చి పిచ్చోడిలా వాగుతున్నాడని మండిపడ్డారు. సమాజంలో హోదా ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తించాలో కూడా బొత్సకు తెలియడం లేదని ఆరోపించారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. “ఒరేయ్ బొత్స.. గతంలో లక్షల మంది ప్రజల సమక్షంలో నా కాళ్లు పట్టుకున్న విషయాన్ని మర్చిపోయావా? ఎన్నికల్లో నిన్ను గెలిపించమని నా చుట్టూ తిరిగావ్. నా దగ్గర డబ్బులు అడుక్కోవడానికి వచ్చిన రోజులను ఒక్కసారి గుర్తుచేసుకో” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read;ఆయిల్‌ఫెడ్ భూమిపై రేవంత్ కన్ను..హరీష్ ఫైర్
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఓడిపోయాక మరోలా మాట్లాడే నాయకులకు ప్రజలే గుణపాఠం చెబుతారని కేఏ పాల్ హెచ్చరించారు. కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

