సైఫ్‌తో ప్రియదర్శన్..ఇంట్రెస్టింగ్!

2
- Advertisement -

భారత దిగ్గజ క్రికెటర్, దివంగత మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (టైగర్ పటౌడీ) కి తాను ఎంతటి పెద్ద అభిమానినో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ వెల్లడించారు. టైగర్ పటౌడీ కుమారుడు, ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్‌లో ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘హైవాన్’. ఈ సినిమా షూటింగ్ సమయంలో సైఫ్‌తో తన తండ్రి గురించి పంచుకున్న జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ గుర్తు చేసుకున్నారు.

విశ్వవిద్యాలయ స్టేడియంలో హైదరాబాద్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్న టైగర్ పటౌడీని చూడటానికి తాను ఎంతో ఆరాటపడ్డానని ప్రియదర్శన్ తెలిపారు.ఆయనను కలవాలనే ఉత్సాహంతో శక్తినంతటినీ ఉపయోగించి వేగంగా పరిగెడుతూ తీవ్రంగా కిందపడిపోయానని, ఆ సమయంలో పెద్ద కంటి గాయం కావడంతో పటౌడీని కలవలేకపోయానని ఆయన వివరించారు.

ఆ తర్వాత చెన్నైలో వెస్టిండీస్‌తో భారత్ ఆడిన మ్యాచ్‌లో టైగర్ పటౌడీ ఆటను చూశానని, ఆ రోజుల్లోనే తాను కూడా క్రికెట్ ఆడటం ప్రారంభించానని పేర్కొన్నారు.’హైవాన్’ చిత్ర సమీకరణల సమయంలో సైఫ్ అలీ ఖాన్‌తో పటౌడీకి సంబంధించిన అనేక విషయాలను చర్చించానని ప్రియదర్శన్ చెప్పారు.టైగర్ పటౌడీ చేసిన దాదాపు అన్ని స్కోర్లు తనకు గుర్తున్నాయని, పటౌడీకి సంబంధించి సైఫ్ సంతకం చేసిన ఒక పుస్తకాన్ని కూడా తాను తీసుకున్నానని తెలిపారు.

అంతకుముందు ‘గరం మసాలా’ సినిమా కథ వినిపించడానికి సైఫ్‌ని కలిసినప్పుడు కూడా.. “మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారా? నేను ఆయనను కలవాలనుకుంటున్నాను” అని ప్రియదర్శన్ మొదటిమాటగా అడిగారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ తన తండ్రి టైగర్ పటౌడీకి …దర్శకుడు ప్రియదర్శన్‌కి మధ్య ఒక విచిత్రమైన పోలిక ఉందని చెప్పారు.1961లో లండన్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఒక కంటి చూపును కోల్పోయారు. అయినప్పటికీ 20 ఏళ్ల వయసులోనే భారత టెస్టు జట్టులోకి వచ్చి, ఆ తర్వాత అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా నిలిచి గొప్ప క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నారు.

Also Read:ఆయిల్‌ఫెడ్ భూమిపై రేవంత్ కన్ను..హరీష్‌ ఫైర్

- Advertisement -