సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దేవరియాలో జరిగిన బహిరంగ సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఎస్పీ, కాంగ్రెస్ పాలనలో ‘బిమారు’ (BIMARU) రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్, ఇప్పుడు గౌరవప్రదమైన గుర్తింపును సాధించుకుందని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో మాఫియా పాలనకు పూర్తిగా తెరపడిందని చెప్పారు.
ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించిన యోగి ఆదిత్యనాథ్.. సమాజవాదీ పార్టీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సమాంతర మాఫియా పాలన నడిచేదని, అయితే భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వంలో దానిని పూర్తిగా అణచివేసామని అన్నారు. దేవరియాలో జరిగిన ర్యాలీలో బిజెపి నాయకుడు మాట్లాడూతూ, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అభివృద్ధి లేక వెనుకబడి ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్ తన పేరుకు తగినట్లుగా ఎదుగుతోందని ఇప్పుడు రాష్ట్రం పేరు వింటే ఎవరూ సంకోచించాల్సిన అవసరం లేదన్నారు.
ఆనాటి సమాజవాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాల రుగ్మత మనస్తత్వమే ఇక్కడి అమాయకుల ప్రాణాలను బలిగొంది. ఆ సమయంలో అధికారులు, పాలకులు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు అని ముఖ్యమంత్రి ఆరోపించారు. వారు మౌనంగా ఉండిపోయారు; వారిలో మానవత్వం చనిపోయింది, అమాయకులు మూల్యం చెల్లించుకున్నారు. నలభై ఏళ్ల కాలంలో 50 వేల మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సమాజవాదీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి గానీ, కాంగ్రెస్‌కు చెందిన ప్రధాని గానీ ఒక్కసారి కూడా ఇక్కడి పరిస్థితులను పరిశీలించడానికి రాలేదు అని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్‌లో తమ ప్రభుత్వం ప్రజల జీవితాలను ఎంతో మెరుగుపరిచిందని యోగి ఆదిత్యనాథ్ వివరించారు. సమాజవాదీ పార్టీ వైఫల్యాలకు గాను ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 26న మేము ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన వెంటనే, సమాజవాదీ పార్టీ ‘బాబుయా’ నిద్రలేచి హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఏం మాట్లాడాలో కూడా ఆయన మరిచిపోయారు అని యోగి ఎద్దేవా చేశారు.
Also Read:ఇమ్రాన్‌కు మద్దతుగా కమిన్స్

