ఇథనాల్ పెట్రోల్‌..సుప్రీంలో విచారణ

1
- Advertisement -

పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ (Ethanol) కలిపారో స్పష్టంగా ప్రదర్శించడాన్ని నిర్బంధం చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఆగస్టు 31న విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పెట్రోల్ బంకుల వద్ద రీఫ్యూయలింగ్ మిషన్లపై పెట్రోల్‌లో కలిపిన ఎథనాల్ శాతాన్ని (ఉదాహరణకు E10, E20) స్పష్టంగా ప్రదర్శించేలా చమురు సంస్థలను మరియు ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ పేర్కొంది.

పాత వాహనాలు లేదా కొన్ని నిర్దిష్ట మోడళ్లు అధిక ఎథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్‌ను తట్టుకోలేకపోవచ్చని, ఇది ఇంజిన్ విడిభాగాలను దెబ్బతీసే అవకాశం ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వాహనదారులు తమ వాహనానికి ఏ రకమైన ఇంధనం సరిపోతుందో తెలుసుకుని ఎంచుకునే హక్కు కలిగి ఉండాలని, సమాచారం దాచడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనేనని పిటిషన్‌లో వాదించారు.

Also Read:ఇమ్రాన్‌కు మద్దతుగా కమిన్స్

సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మరియు ఇంధన ఉత్పత్తి సంస్థల వివరణ కోరే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -