పెరోల్‌పై వెళ్లి 40 ఏళ్ల తర్వాత!

3
- Advertisement -

పెరోల్‌పై వెళ్లి 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డాడు ఓ ఖైదీ. జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్‌పై జైలు నుంచి విడుదలై తిరిగి రాకుండా ఏకంగా 30 ఏళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగాడు ఓ ఖైదీ.

అంతేగాదు 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కూడా అందుకుని.. 13 ఏళ్ల క్రితమే రిటైర్ అయ్యారు కూడా. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్నకు ఓ కేసులో 1983 జూన్ 9న జీవిత ఖైదు శిక్ష విధించింది వరంగల్ జిల్లా కోర్టు.

అదే సంవత్సరం డిసెంబరు 17న పెరోల్‌పై విడుదల చేయగా.. 1984 మార్చి 18న అతడు జైల్లో లొంగిపోవాల్సి ఉన్నా తిరిగి జైలుకు రాలేదు. అతడు పారిపోయిన 40 ఏళ్ల 58 రోజుల తర్వాత అంటే 2024 మే 16న మళ్లీ అదుపులోకి తీసుకున్నారు వరంగల్ సెంట్రల్ జైలు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.

Also Read:క్రీడలకు మరింత ప్రాధాన్యం:మోదీ

మూడేళ్ల పాటు ఎలాంటి పెరోల్, జైలు శిక్ష మినహాయింపు లేకుండా మెమో జారీ చేయగా బంధువుల సహాయంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది నిందితుడి భార్య సందెల చారమ్మ. వాదనలు విని నిందితుడు ఉద్దేశపూర్వకంగానే తప్పించుకు తిరుగుతున్నాడని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది హైకోర్టు.

- Advertisement -