మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్

2
- Advertisement -

మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా హరీష్ రావు పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కనీసం వాహనం కూడా ఎక్కించకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని తరలించారు పోలీసులు.

దీంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించగా పోలీసుల తీరుపై మండిపడుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు హరీష్‌. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప తెలంగాణలో EHS అమలు కావడం లేదు..ప్రభుత్వంతో అగ్రిమెంట్ కాలేదు, మాకిచ్చే ఆరోగ్యశ్రీ బకాయిలే పెండింగ్‌లో ఉన్నాయి అన్నారు.

Also Read:క్రీడలకు మరింత ప్రాధాన్యం:మోదీ

ఈ ప్యాకేజీలతో గిట్టుబాటు కాదు, మేము EHS అమలు చేయడానికి సిద్ధంగా లేమని ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్తున్నాయి… ప్రభుత్వం ఆసుపత్రులతో అగ్రిమెంట్ చేసుకోకుండానే ఉద్యోగుల జీతాల్లో 1.5 పర్సెంట్ కట్ చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

- Advertisement -