నాగార్జున..‘కింగ్100’

4
- Advertisement -

కింగ్ నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్నారు. #King100 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తమ అభిమాన హీరో 100వ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఈ చిత్రంలో నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి చిత్రాల్లో నాగార్జునతో కలిసి నటించిన టబు.. చాలా కాలం తర్వాత మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా మేకర్స్ వెల్లడించనున్నారు.నాగార్జున పుట్టినరోజుకు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో #King100 టైటిల్ గ్లింప్స్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది.

Also Read:జలప్రళయం..ఆ రాష్ట్రాలకు అలర్ట్!

నటీనటులు: కింగ్ నాగార్జున, టబు

రచన, దర్శకత్వం: రా కార్తీక్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

- Advertisement -