దర్శకుడు పవన్ సాధినేని అరెస్ట్

1
- Advertisement -

తెలుగు చిత్రసీమలో యువ దర్శకుడిగా గుర్తింపు పొందిన పవన్ సాధినేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

బాధితురాలైన నటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన అనంతరం దర్శకుడిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తనను మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

పవన్ సాధినేని తెలుగులో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’, ‘సేనాపతి’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఆయన మలయాళంలో ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌తో ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Also Read:చిదంబరంకు శివరాజ్‌ కౌంటర్

సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్న సమయంలో దర్శకుడు పవన్ సాధినేని అరెస్ట్ కావడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -